గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీల (MLC)ను తిరస్కరిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై దాసోజు శ్రవణ్ (Dasoju Shravan).. కుర్రా సత్యనారాయణ (Kurra Satyanarayana) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.. అయితే ఆర్టికల్ 171 ప్రకారం గత ప్రభుత్వం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిందని.. ఆ అభ్యర్ధనను గవర్నర్ ఆపడానికి వీలు లేదని వీరిద్దరూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
నేడు పిటీషన్ పై హైకోర్టు (High Court) విచారణ జరిపింది. క్యాబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆపడానికి వీలు లేదని శ్రవణ్, సత్యనారాయణ తరుపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. మరోవైపు ఆర్టికల్ 361 ప్రకారం ఈ పిటిషన్ కు అర్హత లేదని గవర్నర్ తరుపు కౌన్సిల్ వాదించింది. కాగా ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు పిటీషన్ మెంటేనబిలిటీ పై విచారణ జరుపుతామని తెలిపింది.
జనవరి 24 కు తదుపరి విచారణ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయన పేర్లను గత బీఆర్ఎస్ సర్కార్ సూచించింది. అప్పటి క్యాబినెట్ సైతం ఆమోద ముద్ర వేసింది. దీంతో ఫైనల్ గా ఫైల్ గవర్నర్ దగ్గరకు వెళ్ళింది. అయితే గవర్నర్ ఆ ఫైల్ ను హోల్డ్ లో పెట్టింది.
ఇంతలో ఎన్నికలు రావడం.. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ రూలింగ్ లోకి రావడంతో శ్రవణ్, సత్యనారాయణ ఎమ్మెల్సీ పదవులపై అయోమయం నెలకొంది. ఇదిలా ఉండగా.. గవర్నర్ తమిళిసై గతేడాది సెప్టెంబర్ 19న ఎమ్మెల్సీలను తిరస్కరించారు. అప్పడు మొదలైన వివాదం చివరికి కోర్టు మెట్లు ఎక్కింది. ఇంకా సస్పెన్స్ లోనే ఉంది..