బీఆర్‌ఎస్ (BRS) అధికారంలో ఉన్న సమయంలో ప్రణీత్‌రావు (Praneeth Rao) ఆడింది ఆటగా.. పాడింది పాటగా సాగింది. ప్రస్తుతం ఆయన వ్యవహారం వివాదాస్పదంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో అధికార దుర్వినియోగంకు పాల్పడినట్లు తేలింది.. అదీగాక విపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ , సీసీ ఫుటేజీలు, హార్డ్ డిస్క్‌లు ధ్వసం చేశారనే ఆరోపణలు ఆయన చుట్టూ ముట్టాయి..

దీని ఆధారంగా పంజాగుట్ట (Panjagutta) పోలీస్ స్టేషన్‌లో అతనిపై ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదైంది. అదీగాక రహస్యంగా సమాచారం సేకరించడం, వ్యక్తిగత వివరాలను తస్కరించారని తేలింది. దీంతో ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు నివేదికలు పరిశీలించిన ఎస్ఐబీ అధికారులు.. ప్రణీత రావు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించారు.. దీంతో పంజాగుట్ట ఫిర్యాదు చేశారు..
ఈ క్రమంలో ప్రణీత్ రావుతో పాటు మరికొంత మంది మీద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక ప్రత్యేకంగా 17 సిస్టమ్స్ ఏర్పాటు చేసుకొని రహస్య సమాచారం సేకరించినట్లు తేలింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తన వద్ద ఉన్న సమాచారనీ ఇతర హార్డ్ డిస్కులోకి మార్చుకొన్నట్లు అధికారులు గుర్తించారు.. ఇదిలా ఉండగా ప్రణీత్ రావు మీద IPC సెక్షన్ కింద 409, 427, 201, 120 (బీ), పిడీపీపీ, ఐటీ ఆక్ట్ కింద కేసు నమోదు చేశారు..