తెలంగాణ (Telangana)లో ప్రస్తుతం కాంగ్రెస్ (Congress) పాలన నడుస్తోందని.. కాని బీఆర్ఎస్ (BRS) నాయకులు ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా మాట్లాడిన మంత్రి.. ఇప్పటి వరకు 15 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారన్నారు.
ఇదంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రమే జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు ఆర్టీసీకి రూ. 535 కోట్ల విలువ గల బస్ ఫెయిర్స్ని ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఆటో డ్రైవర్లకు నెలకు కూ. 15వేలు ఇవ్వాలని హరీష్ రావు (Harish Rao) చేసిన వ్యాఖ్యలకు పొన్నం ప్రభాకర్ కౌంటర్ వేశారు. మీ ప్రభత్వ హయాంలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె పేరిట పడ్డ కష్టాలు గుర్తున్నాయా? అని ప్రశ్నించారు.. వారికి న్యాయం చేయలేని బీఆర్ఎస్.. ప్రతిపక్షంలోకి వెళ్ళగానే పవిత్రం అయినట్లు మాట్లాడటం విడ్డూరమన్నారు.
బీఆర్ఎస్ హయంలో డ్రైవర్ల కష్టాలు పక్కన పెట్టిన బీఆర్ఎస్ నేతలు.. వారి నుంచి అడ్డగోలుగా దోపిడి చేశారని ఆరోపించారు.. ఆటో పన్ను రద్దు చేస్తున్నామని చలాన్ల పేరుతో వేల రూపాయలు వసులు చేశారని మండిపడ్డారు. సభని తప్పుదోవ పట్టించే విధంగా 21 మంది ఆత్మహత్య చేసుకొన్నారని బీఆర్ఎస్ నేతలు తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు పేర్కొన్న పొన్నం ప్రభాకర్.. అటో డ్రైవర్లను బీఆర్ఎస్ నేతలే ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు.
గతంలో ఆటోల్లో ప్రయాణం చేయని వారు.. నేడు నవాబ్ సాబుల్లా ఆటోల్లో వస్తున్నారని పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. అహంకార ఫ్యూడల్గా ఆటోల్లో ప్రయాణం చేస్తున్నారని, ఆటో కార్మికులు జీవనోపాధి కోసం నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోల్లో వచ్చి వారిని అవమానపరుస్తున్నారన్నారు. ఆర్టీసీని ప్రక్షాళన చేస్తున్నామని, ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే తమ ధ్యేయమని, ఆటో కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం మానుకోండని సూచించారు.