Telugu News » యాత్ర 2 లో డైరెక్టర్ మిస్ అయిన ఈ లాజిక్ ని మీరు గమనించారా..?

యాత్ర 2 లో డైరెక్టర్ మిస్ అయిన ఈ లాజిక్ ని మీరు గమనించారా..?

by Sravya

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా 2019లో యాత్ర సినిమా వచ్చిన విషయం తెలిసిందే. యాత్ర 2 సినిమాని ఆ సినిమాకి సీక్వెల్ గా తీసుకురావడం జరిగింది. యాత్ర 2 సినిమాకి దర్శకుడు మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు. యాత్ర టు లో వైయస్ రాజశేఖర్ రెడ్డి 2009 ఎన్నికల్లో విజయాన్ని సాధించడం మొదలు 2019 ఎన్నికల్లో సీఎం జగన్ విజయం సాధించే దాకా జరిగిన పలు సంఘటనలు తీసుకుని సినిమాని తెర మీదకి తీసుకొచ్చారు. అయితే ఈ సినిమాలో కొన్ని లాజిక్స్ ని దర్శకుడు మిస్ అయ్యారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

యాత్ర టు ని పూర్తి గా కన్వీనెంట్ గా తీశారు. వన్ సైడెడ్ బయోపిక్ అనడానికి ఇందులో చాలా ప్రూఫ్స్ ఉన్నాయి జగన్ కి ప్రతికూలమైన చంద్రబాబు నాయుడు అలానే సోనియా గాంధీ వంటి వాళ్ళని విలన్ గా చూపించారు. అందులో అస్సలు ఏమాత్రం తగ్గలేదు. జగన్ కి ఇబ్బంది కలిగించే వ్యక్తులు పాత్రలని ఈ సినిమాలో లేకుండా కూడా చూసుకున్నారు. ముఖ్యంగా జగనన్న వదిలిన బాణాన్ని అని జగన్ జైల్లో ఉండగా కష్టపడి పాదయాత్ర చేసిన షర్మిల ని సినిమాలో పెట్టలేదు. జగన్ సోదరి షర్మిల ఆనవాళ్లు కూడా లేకుండా సినిమాని తెర మీదకు తీసుకురావడం జరిగింది జగన్ జైలుకు వెళ్ళినప్పుడు తల్లి విజయమ్మ భార్య భారతిని ఆయన కోసం పోరాడినట్లు విజయమ్మ జనాల్లో తిరుగుతున్నట్లు చూపించారు.

Also read:

ఇంకో పక్క పవన్ కళ్యాణ్ అలానే వైయస్ వివేకానంద రెడ్డి పాత్రలు కూడా సినిమాలో కనపడలేదు. కానీ ఒక చోట మాత్రం చంద్రబాబు పాత్రతో ఒకవైపు బిజెపిని జాతీయ పార్టీ జనసేన ని తల తోకాలేని పార్టీ అని పరోక్షంగా పవన్ పై కౌంటర్ వేశారు. అయితే జగన్ హీరోని చేయడానికి మాత్రమే ఈ సినిమా తీశారు అనడంలో ఎలాంటి డౌట్ కూడా లేదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్తూరు రచ్చబండ కార్యక్రమం కి వెళ్లే టైంలో రాజశేఖర్ రెడ్డి జగన్ కొన్ని విషయాలు గురించి మాట్లాడుకుంటారు. తర్వాత హెలికాప్టర్ ప్రమాదం జరిగిందని టీవీలో చూపించినప్పుడు నిజంగా అయితే జగన్ ఇంట్లోనే ఉన్నారు కానీ బయోపిక్లో మాత్రం ఇడుపులపాయకి వెళ్లినట్లు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని వీక్షించినట్లు చూపించారు ఇలా యాత్ర 2 సినిమాలో చాలా సీన్స్ లో లాజిక్ నేమ్స్ అయ్యారు దర్శకుడు.

You may also like

Leave a Comment