పొలిమేర సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. పోలిమేర 1 కి రెస్పాన్స్ బాగుండడంతో పొలిమేర టూ కూడా తీసారు. అనిల్ విశ్వనాధ్ ఈ సినిమాని తెరమీదకి తీసుకువచ్చారు. పార్ట్ వన్ లో వదిలేసిన సస్పెన్స్ ని పార్ట్ 2 లో దర్శకుడు రివిల్ చేశారు. జాస్తిపల్లి ఊరి పొలిమేరలో ఉన్న ఏకపాద మూర్తి గుడికి కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి గుడికి లింక్ ఉందని అక్కడ నిధులు ఉన్నాయని కొమెరి చేసే క్షుద్ర పూజల వల్ల వాటిని సొంతం చేసుకోవచ్చని ఇలా దర్శకుడు అద్భుతంగా కథ తీసారు. గుడి ఉండేది ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా వద్ద ఉన్న గండికోటలో ఉన్నది.
గండికోట కోటలో ఉన్న 16వ శతాబ్దము హిందూ దేవాలయం అప్పట్లో కృష్ణుడి ప్రథమ ఉండేది. దీనిని మాధవరాయ ఆలయం లేదంటే మాధవరాయ స్వామి ఆలయం అని కూడా అంటారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా గుర్తించింది. భారత ప్రభుత్వం ఈ గుడిలో ఇప్పటికే చాలా షూటింగ్ లు జరిగాయి కూడా. మహమ్మదీయులు దాడుల వలన ఈ గుడి పూర్తిగా కూలిపోయింది.
Also read:
ఆ టైం లో గుడిలో ఉన్న విగ్రహాన్ని అక్కడ నుండి కడప జిల్లాలోని మైదుకూరుకు తరలించారు. దీంతో ప్రస్తుతం ఈ గుడిలో దేవుడి విగ్రహం లేదు. ఊరికి దూరంగా ఉండడం వలన గుడికి తాళం వేసి ఉంచుతారు. టూరిస్టులు వెళ్లిన సమయంలో గేట్లు ఓపెన్ చేస్తారు. ఇక్కడ గుడిలో నిధులు ఏమీ లేవు. మహమ్మదీయులు దాడుల సమయంలో వాటిని దోచుకున్నారు. గుడి గోడల మీద మాత్రం ప్రత్యేకమైన చిహ్నాలు అయితే ఉంటాయి.