Telugu News »  Houseful :డిసెంబర్ సినిమా చూపిస్తుంది మామ..!

 Houseful :డిసెంబర్ సినిమా చూపిస్తుంది మామ..!

డిసెంబర్ నెల సినీమన్త్ కాబోతుంది. నాలుగు శ్రుక్రవారాలు సినీ వారాలుగా, సినీప్రియులకు వరాలుగా మారబోతున్నాయి.

by sai krishna

డిసెంబర్ నెల సినీమన్త్ కాబోతుంది. నాలుగు శ్రుక్రవారాలు సినీ వారాలుగా, సినీప్రియులకు వరాలుగా మారబోతున్నాయి. శుక్రవారం సెంటిమెంటు ప్రకారం వారానికి రెండు సినిమాలు చొప్పున బొమ్మపడినా…బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు సైతం.. ఒక్క ఛాన్స్ అంటున్నాయి.

 

క్రిస్మస్(Christmas)హాలీడేస్ క్యాష్ చేసుకోవాలని కొందరు వస్తుంటే..దానికి ముందే మరికొందరు బరిలోకి దిగుతున్నారు. తాజాగా వరుణ్ తేజ్ కొత్త సినిమా ఆపరేషన్ వాలంటైన్ డిసెంబర్ 8న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. అదే రోజు విశ్వక్ సేన్(Vishwak Sen)గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా రానుంది.

డిసెంబర్ 1న యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి వంగా వచ్చేస్తున్నారు. రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) నటిస్తున్న ఈ చిత్రంపై సౌత్‌లోనూ అంచనాలు బానే ఉన్నాయి. ఇక డిసెంబర్ 9న దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి నటిస్తున్న ‘సెల్ఫిష్’ విడుదల కానుంది. డిసెంబర్ 15న మాత్రం ఇప్పటి వరకు ధనుష్ కెప్టెన్ మిల్లర్ మాత్రమే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకుంది.

ఆ తర్వాత వారం డిసెంబర్ 21న నాని హాయ్ నాన్నతో రానున్నారు. డిసెంబర్ 22న సైంధవ్‌తో వెంకటేష్(Venkatesh), హరోం హరతో సుధీర్ బాబు వచ్చేస్తున్నారు. ఆ మరుసటి రోజే ఎక్స్‌ ట్రా ఆర్డినరీ మ్యాన్ అంటూ నితిన్ లైన్‌లో ఉన్నారు.

ప్రస్తుతానికి డిసెంబర్ హౌజ్ ఫుల్ కానీ ఇంకా ఎన్ని సినిమాలు రానున్నాయో ఇప్పుడే చెప్పలేం. వేటికవే సెపరేట్ కాన్సెప్టులతో వస్తున్న సినిమాలే ఇవన్నీ.. మరి వీటిలో ఏది ప్రేక్షకుల మనసు దోచుకుంటుందో చూడాలి. నాని హీరోగా తెరకెక్కుతోన్న హాయ్ నాని అనే సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది.

You may also like

Leave a Comment