పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) కూడా పోటాపోటీగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.. ఇప్పటికే బీఆర్ఎస్ ను ఖాళీ చేయాలని వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్ (Congress) తీవ్ర విమర్శలతో సమావేశాలు నిర్వహిస్తుండగా.. బీఆర్ఎస్ (BRS) సైతం లోక్ సభ ఎన్నికల్లో తమ తడాఖా చూపించాలనే పట్టుదలతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
ఇందుకు అనుగుణంగా కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR), హరీష్ రావు తో పాటుగా ఇతర నేతలు సైతం విమర్శలను ఆయుధాలుగా కాంగ్రెస్ పై ప్రయోగిస్తున్నారు.. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నిన్నటి పర్యటన వీడియోలు చూస్తే నల్గొండ జిల్లాలో ఎలా ఓడిపోయామో తెలియడం లేదని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు..
నేడు మీడియాతో మాట్లాడిన ఆయన పదేళ్ల నిజం ముందు వంద రోజుల అబద్దాలను ప్రజలు గమనిస్తున్నారన్నారని పేర్కొన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ కు మోసపోయినోళ్లు ఓటేయాలని.. కాంగ్రెస్కు రుణమాఫీ వచ్చినోళ్లు ఓటేయాలని తెలిపారు.. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామన్నా కోమటిరెడ్డి అహంకారాన్ని ఓటు రుచి చూపించాలని కేటీఆర్ వెల్లడించారు.. అన్ని రకాలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్ కు ప్రస్తుతం ఓటు వేస్తే ఐదేళ్లు మాత్రమే తప్పించుకుంటారని విమర్శించారు..
కాంగ్రెస్ కి బీఆర్ఎస్తో డేంజర్ లేదని తెలిపిన కేటీఆర్.. అసలు ప్రమాదం నల్గొండ, ఖమ్మం నాయకులతోనే అని కీలక వ్యాఖ్యలు చేశారు.. ఖతర్నాక్ ఏక్ నాథ్ షిండేలు ప్రస్తుతం ఉన్నది కాంగ్రెస్ పార్టీలోనే అని ఆరోపించారు.. మరోవైపు ముఖ్యమంత్రి పదవి ఇస్తే బీజేపీలోకి వస్తానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుసగుసలాడినట్లు ఆరోపణలు చేశారు..