కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవాలనే కోరిక ప్రతి భక్తునికి ఉంటుంది. కొందరైతే ఎంత రిస్క్ అయినా సరే.. నెలకొక్క సారి అయినా ఆ వెంకట నాధుని సన్నిధికి వెళ్తారు.. కానీ మరికొందరికి వెళ్లాలని ఉన్నా.. సమయం చిక్కక వెళ్లలేకపోయామనే బాధలో ఉంటారు.. అయితే మీ సమయం ఆదాయ అయ్యేలా.. తెలంగాణ (Telangana) టూరిజం శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.

ఇక ఈ తిరుపతి వన్ డే ప్యాకేజీ టూర్ యొక్కవివరాలు గమనిస్తే.. హైదరాబాద్ లో ఉదయం 6.55 గంటలకు ఫ్లైట్ ఎక్కితే 8 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొంటారు.. అక్కడి నుంచి కారులో తిరుపతి (Thirupathi) హోటల్ కు తీసుకెళ్తారు. ఫ్రెషప్ అయిన తర్వాత తిరుమలకు మళ్లీ కారులో బయల్దేరాలి.. మద్యాహ్నం ఒంటి గంట సమయానికి శ్రీవారి దర్శనం పూర్తవుతుంది. అనంతరం తిరుపతి చేరుకొంటారు.
ఓ గంట విశ్రాంతి తర్వాత తిరుచానూర్ పద్మావతి అమ్మవారిని దర్శించుకొని మళ్లీ ఎయిర్ పోర్ట్ కు బయల్దేరాలి. సాయంత్రం 6.35 గంటలకు రేణిగుంట నుంచి బయల్దేరి రాత్రి 7.45కు హైదరాబాద్ (Hyderabad) చేరుకోవడంతో ఈ వన్ డే ప్యాకేజీ టూర్ ముగుస్తుందని టూరిజం శాఖ తెలిపింది. కాగా ఈ ప్యాకేజ్ ధర ఒక్కొక్కరికి 12 వేల 499 రూపాయలుగా పేర్కొంది.
ఇందులో ఫ్లైట్ టికెట్, కారు ట్రావెల్ చార్జెస్, రెండు చోట్ల ప్రత్యేక దర్శనాలు కవర్ అవుతాయి. దీంతో పాటు తెలంగాణ టూరిజం మరో ప్యాకేజీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది రెండు రోజుల తిరుపతి టూర్ ప్యాకేజీ. దీని ధర రూ. 15,499 లుగా ఉందని వెల్లడించింది. పూర్తి వివరాలు www.tourism.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొంది..