Tiger Nageswar rao Review: మాస్ మహా రాజ్ ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమాతో వచ్చారు. ఈ సినిమా మంచి అవుతుందని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ని పెట్టుకున్నారు ప్రేక్షకులు. ఈ మూవీ లో రవితేజ, నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ తదితరులు నటించడం జరిగింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని నిర్మించారు. వంశీ దర్శకత్వం వహించారు. జి వి ప్రకాష్ సంగీతాన్ని అందించారు.
చిత్రం : టైగర్ నాగేశ్వరరావు
నటీనటులు : రవితేజ, నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ తదితరులు
నిర్మాత : అభిషేక్ అగర్వాల్
సంగీతం : జి వి ప్రకాష్ దర్శకత్వం : వంశీ విడుదల తేదీ : అక్టోబర్ 20, 2023
Also read:
టైగర్ నాగేశ్వరరావు కథ, వివరణ: ఈ మూవీ కథ విషయానికి వస్తే… ఈ మూవీ ప్రైమ్ మినిస్టర్ (అనుపమ్ ఖేర్) కి, గుంటూరు ఎస్పీ (మురళీ శర్మ) చెప్పడం తో కథ స్టార్ట్ అవుతుంది. స్టువర్టుపురంలో ఉండే స్టువర్టుపురం నాగేశ్వరరావు గురించి చెప్తాడు. స్టువర్టుపురం నాగేశ్వరరావు యుక్త వయసులో సారా (నుపుర్ సనన్) అనే ఆమె ని ప్రేమిస్తాడు. ఇదిలా ఉంటే అక్కడ జరుగుతున్న కొన్ని సంఘటనల కారణంగా స్టువర్టుపురం నాగేశ్వరరావు కొంచెం మారాల్సి ఉంటుంది. ఏం అవుతుంది..? స్టువర్టుపురం నాగేశ్వరరావు కి ఎదురైనా సంఘటనలు ఏమిటి అసలు..?
స్టువర్టుపురం నాగేశ్వరరావు టైగర్ నాగేశ్వరరావు గజదొంగగా మారడానికి కారణం ఏమిటి..? వీవీఐపీ ఉన్నచోట చోరీ ఎందుకు చెయ్యాలి..? ఎటువంటి మార్పు ఊరిలో వస్తుంది..? స్టువర్టుపురం దొంగని పట్టుకోవాలని ప్రైమ్ మినిస్టర్ ఎందుకు ఆర్డర్ వేసారసలు..? ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ ని చూడాలి. బిగినింగ్ చాలా బాగా తీశారు. మూవీ మొత్తం 1980 లోనే వెళ్తుంది. ఈ మూవీ లో ఊరిలో జరిగే సంఘటనలని తెర మీద బాగా చూపించారు. కానీ ఈ సినిమా లో లవ్ స్టోరీ కొంచెం ఇడియట్ లవ్ స్టోరీ లాగే ఉంటుంది. నిజానికి లవ్ స్టోరీ ఇందులో అవసరమే లేదు. సినిమాలోని రాబరీ సీన్స్ అయితే బావున్నాయి. అలానే ఇందులో యాక్షన్ సీన్స్ కూడా బావున్నాయి. సెకండ్ హాఫ్ లో రాబిన్ హుడ్ స్టైల్ లోకి మూవీ ని తీసికెళ్లారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. స్టోరీ కూడా చాలా బాగుంది.
ప్లస్ పాయింట్స్:
రవితేజ పాత్ర
సినిమా స్టోరీ
కొన్ని యాక్షన్ సీన్స్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
సినిమా లెన్త్ ఎక్కువ వుంది
అనవసరమైన లవ్ ట్రాక్
రెండవ పార్ట్
అక్కడక్కడా బోరింగ్ సీన్స్
రేటింగ్: 2.75/5