Telugu News » Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్టార్ హీరోయిన్, టాలీవుడ్ కొత్త జంట..!

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్టార్ హీరోయిన్, టాలీవుడ్ కొత్త జంట..!

బాలీవుడ్‌ స్టార్‌ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. మరోవైపు టాలీవుడ్‌ స్టార్‌ దగ్గుబాటి సురేశ్‌ కుటుంబం శ్రీవారిని దర్శించుకుంది.

by Mano
Tirumala: Star heroine, Tollywood's new couple visited Tirumala Srivari..!

తిరుమల(Tirumala) వేంకటేశ్వర స్వామి(Venkateshwara swami) వారిని బాలీవుడ్‌ స్టార్‌ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

Tirumala: Star heroine, Tollywood's new couple visited Tirumala Srivari..!

శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు నటికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దీపికా.. అలిపిరి మెట్లమార్గం ద్వారా కాలినడకన గురువారం రాత్రి కొండపైకి చేరుకున్నారు. రాత్రి తిరుమలలోనే బస చేశారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆమె శ్రీవారిని‌ దర్శించుకున్నారు.

మరోవైపు టాలీవుడ్‌ స్టార్‌ దగ్గుబాటి సురేశ్‌ కుటుంబం శ్రీవారిని దర్శించుకుంది. సురేశ్‌ దంపతులతోపాటు కొత్త జంట దగ్గుబాటి అభిరామ్‌ దంపతులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలోనే వీరు కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారు.

Tirumala: Star heroine, Tollywood's new couple visited Tirumala Srivari..!

సురేష్‌ బాబు రెండో కుమారుడు అభిరామ్ వివాహం ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొత్త దంపతులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో నూతన దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు.

You may also like

Leave a Comment