ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది.. ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) ఇప్పటికే యాక్షన్ లోకి దిగినట్టు తెలుస్తోంది. దీంతో ఎప్పుడేం ప్రకటన వస్తుందో.. ఎక్కడ తమ సీటుకు ఎసరుపడుతుందో అని సిట్టింగులు టెన్షన్ టెన్షన్‌తోనే గడిపేస్తున్నారు. ఈ సమయంలో నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజా (Minister RK Roja) ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారనే ఆసక్తి నెలకొంది.
మరోవైపు తిరుమల (Thirumala)లో ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్న ఆమె.. వచ్చే ఎన్నికల్లో తాను నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్నట్టు సంకేతాలు ఇచ్చారు.. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నగరి (Nagari) నుంచి పోటీ చేస్తా.. హ్యాట్రిక్ కోడతానని తెలిపారు. అయితే రోజా ను ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దింపేందుకు వైసీపీ అధిష్టానం ఆలోచిస్తుందనే ప్రచారం జోరుగా సాగింది..
కానీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరు తెరపైకి రావడం.. దాదాపు ఆయన పేరు ఖరారు చేసినట్టు.. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని వైసీపీ శ్రేణుల్లో ప్రచారం మొదలైంది.. దీంతో అక్కడి నుంచి పోటీ చేస్తారని భావించిన రోజాకు చివరికి నగరి అసెంబ్లీ నియోజకవర్గం కన్ఫామ్ అయ్యే సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాను మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేసినట్టు భావిస్తున్నారు..
మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది దూకుడుగా వ్యవహరిస్తూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. పలు మార్పులు, చేర్పులు చేస్తోన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఐదు దఫాలుగా అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం.. కొన్ని స్థానాల్లో సిట్టింగ్‌లను మార్చి గెలుపుపై ఆశలు పెంచుకోంటుంది. ఇదిలా ఉండగా ఈ ఎన్నికలు జగన్ ప్రభుత్వానికి కీలకంగా మారనుండగా.. ఏపీలో పోరు ఉత్కంఠంగా సాగే అవకాశాలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు..