Latest Breaking news in telugu, happening around the world, india and telangana, a.p.
మహారాష్ట్ర (Maharashtra) రాజధాని ముంబై (Mumbai), ఛత్రపతి శివాజీ మహారాజ్ (Chhatrapati Shivaji Maharaj) ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (International Airport)లో రూ. 19.79 కోట్ల విలువైన కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో సియెర్రా లియోన్‌కు చెందిన ఒక మహిళ నుంచి 1,979 గ్రాముల కొకైన్ పట్టుబడినట్లు వెల్లడించారు.
దీంతో ఆ మహిళను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అరెస్టు చేసినట్టు తెలిపారు.. కెన్యా (Kenya) రాజధాని, నైరోబీ (Nairobi) నుంచి ముంబైలో దిగిన ఓ మహిళ వద్ద మత్తు పదార్థాలు ఉన్నాయని వచ్చిన పక్కా సమాచారంతో అప్రమత్తం అయిన అధికారులు.. ఇందులో భాగంగా నిన్న కట్టుదిట్టంగా తనిఖీలు నిర్వహించగా.. అనుమానస్పదంగా ఈ మహిళ కనిపించిందని తెలిపారు.
ఈ క్రమంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు ఒక అధికారి పేర్కొన్నారు. ఆమె వద్ద షూ, మాయిశ్చరైజర్ బాటిల్, షాంపూ బాటిళ్ల అడుగు భాగంలో తెల్లటి పౌడర్ ఉన్నట్టు కనుగొన్నామని వివరించారు. వాటిని పరీక్షించిన తర్వాత అది కొకైన్‌గా తేలినట్టు అధికారులు తెలిపారు.. కాగా ఆ మహిళను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించామని తెలిపిన వారు.. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై విచారణ చేపడతామని వెల్లడించారు.
మరోవైపు గత బుధవారం సైతం అంతర్జాతీయ కార్టెల్‌కు చెందిన మత్తు పదార్థాలను గుర్తించినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. ఈ స్మగ్లింగ్‌కు సంబంధించి నలుగురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ. 100 కోట్ల విలువైన 9 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకొన్నట్లు పేర్కొన్నారు..