Latest Breaking news in telugu, happening around the world, india and telangana, a.p.
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్(AP) రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఇద్దరు రెబల్ ఎమ్మెల్సీ(Rebel MLC)లపై అనర్హత వేటు పడింది. ఇదివరకే వైసీపీ(YCP), టీడీపీ(TDP)లకు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై ఇటీవల అసెంబ్లీ స్పీకర్ వేటు వేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఇద్దరు వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. పార్టీ ఫిరాయించిన రెబల్ ఎమ్మెల్సీలు పి.రామచంద్రయ్య, వంశీకృష్ణయాదవ్‌పై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ మోషేన్ రాజుకు వైసీపీ ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలు పి.రామచంద్రయ్య, వంశీకృష్ణయాదవ్‌పై శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు విధించారు.
ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ ఫిర్యాదు మేరకు చైర్మన్ విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని పలుమార్లు నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులకు రెబల్ ఎమ్మెల్సీలు స్పందించకపోవడంతో మండలి చైర్మన్ వారిపై వేటు వేసినట్లు తెలుస్తోంది. కాగా, పార్టీ తీరు, అంతర్గత విభేదాలతో ఎమ్మెల్సీలు పి.రామచంద్రయ్య, వంశీకృష్ణయాదవ్ వైసీపీని వీడారు.
అదేవిధంగా ఎమ్మెల్సీ పి.రామచంద్రయ్య టీడీపీలో చేరగా వంశీకృష్ణ పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన విషయం తెలిసిందే. ఎన్నికల వేళ వరుస ఫిరాయింపుగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వరుసగా వేటు పడటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.