విశాఖ (Visakha) సాగరతీరంలో మత్తు పదార్థాలు కలకలం సృష్టించాయి.. ఇంటర్‌పోల్ సమాచారంతో రంగంలోకి దిగిన సీబీఐ (CBI).. బ్రెజిల్ (Brazil) నుంచి విశాఖలోని సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌కు వచ్చిన కంటైనర్‌లో 25 వేల కిలోల మాదక ద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ గరుడ పేరుతో వీటిని సీబీఐ అండ్ కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. జర్మనీ (Germany)లోని హ్యాంబర్గ్ (Hamburg) మీదుగా ఈ నెల 16న కంటైనర్ విశాఖకు వచ్చినట్లు గుర్తించారు.

ఇప్పటికే పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బంది, కూలీల నుంచి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. ల్యాబ్‌ను పరిశీలించిన అధికారులు.. వైజాగ్ నుంచి ఫోరెన్సిక్ బృందాన్ని పిలిపించినట్లు సమాచారం.. వారు ల్యాబ్‌లో ఉన్న వివిధ శాంపిల్స్ సేకరించి విశాఖకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కాగా వారం పది రోజుల్లో టెస్టు రిజల్స్ వస్తాయని అంటున్నారు.. అప్పుడు ఇందులో ఉన్నది నిజంగానే కొకైనా.. లేక కంపెనీ బుక్ చేసిన రా మెటీరియలా అనేది త్వరలోనే బయటపడనుంది.








