Featured posts
తమిళనాడు(Tamilnadu)లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. విరుద్‌నగర్(Virudhranagar)లోని ఓ బాణాసంచా తయారీ కేంద్రం(Fireworks Manufacturing Centre)లో శనివారం ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి.
ఈ అగ్ని ప్రమాదంలో 10 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. మరి కొందరు తీవ్రంగా గాయపడగా అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, రెస్య్కూ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
బాణా సంచా తయారీ మెటీరియల్‌కు మంటలు అంటుకోవడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శివకాశీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అగ్ని ప్రమాద సమయంలో బాణాసంచా తయారీ కేంద్రంలో మొత్తం 200 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.