మనం నిద్రపోయిన తర్వాత మనకి ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కలలు మనకి గుర్తుంటాయి కొన్ని కలలు మనకు అస్సలు గుర్తే ఉండవు. కొన్ని కొన్ని సార్లు భయంకరమైన పీడకలలు వస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు మన లైఫ్ లో ఏదో మంచి జరగబోతున్నట్లు కలలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి చనిపోయిన వాళ్ళు కలలోకి వస్తుంటారు. మనకి దగ్గరగా ఉండే వాళ్ళు, స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోయి, కలలో పదే పదే కనపడితే, దాని వెనుక కారణం ఏంటి..? మంచిదేనా..? లేదంటే ఏమైనా చెడు జరుగుతుందా అనే విషయాన్ని ఇప్పుడే చూద్దాం.
చనిపోయిన వాళ్ళు ఎప్పుడో ఒకసారి, మన కలలో కనపడితే పరవాలేదు. కానీ, తరచుగా కలలో కనపడుతున్నారంటే, వాళ్ళ ఆత్మ ఇంకా ఈ లోకంలోనే తిరుగుతోంది అని, వాళ్లు ఏదో ఆశిస్తున్నారని, దానికి అర్థం. అందుకని తరచూ ఎవరో ఒకరికి వారు కలలో కనపడుతూ ఉంటారట. ఇలా కనపడితే చనిపోయిన వాళ్ళ పేరుతో రామాయణం, భాగవతం వంటి పురాణాలు చదవాలని పండితులు చెప్తూ ఉంటారు. అలానే, ఒకవేళ కనుక చనిపోయిన వాళ్ళు బాధతో మీకు కలలు కనపడితే, ఏదో కీడు జరగబోతుందని దాని వెనుక అర్థం. అలాంటప్పుడు శాంతి చేయించుకోవాలట.
Also read:
చనిపోయిన వాళ్ళు కలలో కనిపించి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నట్లయితే అప్పుడు పేదలకి అన్నదానం చేయాలట. అప్పుడు వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని పండితులు చెప్పడం జరిగింది. కలలో కనుక కోపంగా చనిపోయిన వాళ్ళు కనిపెడితే వాళ్ళు మీ నుండి ఏదో ఆశిస్తున్నారని అర్థం. వాళ్ల పేరుతో ఏదైనా దానం చేస్తే వారి ఆత్మ శాంతిస్తుంది. చనిపోయిన వారు కలలో సంతోషంగా నవ్వుతూ కనపడితే మీకు అంతా మంచి జరగబోతుందని అర్థం. ఇలా ఈ విధంగా చనిపోయిన వాళ్ళు కలలో కనపడటానికి బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా మనం చేసే దాకా వారి ఆత్మ ఈ లోకంలోనే ఉంటుందట వారు ఆశించింది మనం చేస్తే ఆత్మ లోకాన్ని విడిచి వెళ్ళిపోతుంది.