త్వరలో పార్లమెంట్ ఎన్నికలున్న నేపథ్యంలో నేతలు సభలు, సమావేశాలు, ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు.. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎన్నికల ప్రచారం నిమిత్తం కేరళ (Kerala)కు వెళ్లారు.. వయనాడ్ (Wayanad)లో నేటి ఉదయం రైతుల సమావేశంలో పాల్గొన్న ఆయన కీలకమైన ఆరోపణలు చేశారు.. పినరయి విజయన్, ఆయన కుటుంబ సభ్యులు అవినీతిలో మునిగిపోయారని విమర్శించారు..
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాని మోడీతో రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఆయనపై ఈడీ, ఇన్కమ్ టాక్స్ కేసులున్న కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని తెలిపిన రేవంత్.. వారిద్దరి మధ్య రహస్య ఒప్పందం ఉందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు.. మతతత్వ బీజేపీతో కలిసి పని చేస్తున్న ఆయన ఆ పార్టీ అభ్యర్థి సురేంద్రన్‌కి మద్దతు ఇస్తూ.. సీపీఎంతో పాటు కేరళ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
పినరయి విజయన్ (Pinarayi Vijayan)పైకి సీపీఎం ముఖ్యమంత్రిగా, కమ్యూనిస్టు నాయకుడిగా కనిపిస్తున్నా.. కమ్యూనలిస్టు తరహాలో కార్యాచరణ ఉందని విమర్శించారు. అలాగ ఆయనపై ఈడీ, ఐటీ కేసులు ఉన్నన్ని రోజులు సొంత పార్టీ కోసం పనిచేయరని రేవంత్ ఆరోపించారు.. మణిపూర్‌లో వందలాది మంది క్రిస్టియన్లు మరణించినా ప్రధాని, అమిత్ షా అక్కడ పర్యటించలేదని, కానీ రాహుల్ గాంధీ స్వయంగా వెళ్ళి బాధితులను పరామర్శించారని పేర్కొన్నారు.
దేశంలో రెండు పరివార్‌ల మధ్య పోరాటం జరుగుతున్నదని తెలిపిన రేవంత్.. మోడీ (Modi) పరివార్‌లో ఈడీ, ఈవీఎంలు, సీబీఐ, ఇన్కమ్ ట్యాక్స్, అదానీ, అంబానీ ఉన్నారని, ఇండియా పరివార్‌లో ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, వాయనాడ్ కుటుంబ సభ్యులున్నారని తెలిపారు. ఈ పార్టీలో ఇద్దరు దేశం కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు..
అదేవిధంగా సోనియా, రాహుల్‌గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారని తెలిపారు. రాహుల్‌గాంధీకి గత ఎన్నికల్లో వాయనాడ్‌లో 65% ఓట్లు వచ్చాయని, ఈసారి 75% ఓటు బ్యాంక్ పెంచాలని ఓటర్లకు సూచించారు.. ఎందుకంటే ఇది వారణాసి వర్సెస్ వయనాడ్ మధ్య జరుగుతున్న పోరాటం అని గుర్తుంచుకోవలసిన సమయమని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు ఓటు వేయబోయేది కేవలం ఎంపీ అభ్యర్థికి మాత్రమే కాదని తెలిపిన రేవంత్.. దేశానికి కాబోయే ప్రధానికి అని గుర్తు చేశారు.. కేరళ ప్రజల శ్రమతో దుబాయ్ లాంటి దేశాలు అభివృద్ధి చెందాయని, కానీ కేరళ మాత్రం అభివృద్ధి కాలేదన్నారు..