దేశంలో పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి.. ఇప్పటికే నిత్యావసర సరకులతో పాటు పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి.. మధ్యతరగతి మనిషి బ్రతికే పరిస్థితులు రోజు రోజుకు కనుమరుగవుతున్నాయని ప్రజలు ఆందోళనపడుతున్నారు.. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల సామాన్యుడి వేదన గాలి రోదనగా మారుతుందని జనం వాపోతున్నారు..
ఇదిలా ఉండగా రాజస్థాన్ (Rajasthan )లో పెట్రోల్ (Petrol) పంపుల సంఘం సమ్మెను ప్రకటించింది.. దీంతో రానున్న రెండు రోజులు చాలా కష్టతరంగా మారనున్నాయని తెలుస్తోంది.. కాగా రాష్ట్రంలోని పెట్రోల్ బంకులు మరో రెండు రోజులు మూతపడనున్నాయి. మార్చి 10వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభం అయిన ఈ సమ్మె కారణంగా డీజిల్, పెట్రోల్ కొనుగోలు, అమ్మకాలు జరగడం లేదు.
దీంతో వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెట్రోల్ పంప్ ఆపరేటర్ల ఈ సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 6827 పెట్రోల్ బంకులు మూతపడినట్లు తెలుస్తోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ (PM Nrendra Modi) వ్యాట్ తగ్గిస్తామని హామీ ఇచ్చారని, కానీ రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించలేదని, చమురు కంపెనీలు సైతం డీలర్ కమీషన్ పెంచలేదని అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్ర వివరించారు.
ఇదిలా ఉండగా రాజస్థాన్, పొరుగు రాష్ట్రాలైన పంజాబ్ (Punjab), హర్యానా (Haryana), గుజరాత్ (Gujarat), మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో డీజిల్, పెట్రోలు చౌకగా లభిస్తాయని, కానీ రాజస్థాన్‌లో ఇది ఖరీదైనదని ఒక అధికారి తెలిపారు. ఈ సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమ్మె వల్ల తమ పనులపై ప్రభావం పడుతుందని, పనులకు రాలేకపోతున్నామని వాపోతున్నారు. ఈ విషయం పై ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు..