Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
హైదరాబాద్ బేగంపేట (Begumpet) ఎయిర్ పోర్ట్‌లో ‘ఇంటర్నేషనల్ వింగ్స్ ఇండియా 2024’ (International Wings India) వైమానిక ప్రదర్శన నేడు ప్రారంభం అయింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆరంభించారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఏవియేషన్ రంగనిపుణులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి (Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శన నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు.. ఏవియేషన్ రంగానికి తెలంగాణలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని పేర్కొన్న మంత్రి.. డ్రోన్ పైలెట్లకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. వ్యవవసాయం, అత్యవసరాలు, శాంతిభద్రతల్లో డ్రోన్లను వినియోగిస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా వారంలో మూడు సార్లు విమానం వేయాలని జ్యోతిరాదిత్య సింధియాను కోరాను. ఏరో స్పేస్ పెట్టుబడులకు ఎంతో అనుకూలంగా ఉన్న హైదరాబాద్ (Hyderabad)కు.. ఎక్కువగా ఎయిర్ అంబులెన్స్ లు వస్తున్నాయని వెల్లడించారు. మరోవైపు నాలుగు రోజులపాటు జరుగనున్న వింగ్స్ ఇండియా ప్రదర్శన కోసం పలు విమానాలు ఇప్పటికే బేగంపేట విమానాశ్రయానికి చేరుకొన్నాయి.
మొత్తం 106 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధుల హాజరవుతోన్న ఈ కార్యక్రమంలో 25 రకాల విమానాల ప్రదర్శన ఉంటుందని అధికారులు తెలిపారు.. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద బోయింగ్ 777-9 విమానంతో పాటు భారీ విమానాలు, చార్టెడ్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు, డ్రోన్లను ప్రదర్శిస్తున్నారు. కాగా భారత వాయుసేనకు చెందిన సారంగ్ బృందం జనవరి 18 నుంచి 21 వరకు విన్యాసాలు నిర్వహించనుంది.
20, 21వ తేదీల్లో సందర్శకులను అనుమతించనున్నారు. అయితే వింగ్స్ ఇండియా టికెట్ రూ. 750గా ఉంది. బుక్‌మైషో యాప్ ద్వారా సైతం టికెట్లను కొనుగోలు చేయవచ్చని, మూడేళ్లలోపు పిల్లలకు సందర్శన ఉచితంగా ఉంటుందని అధికారులు తెలిపారు..







