Telugu News » Telangana : ఉచిత బస్సు పథకంపై హైకోర్టులో పిటిషన్.. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు..!!

Telangana : ఉచిత బస్సు పథకంపై హైకోర్టులో పిటిషన్.. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు..!!

కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ జీవో జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఇది వివక్షతో కూడిన నిర్ణయమని పేర్కొన్నారు..

by Venu
TSRTC Good News For Male Passengers

అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ప్రచారంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలలో భాగంగా మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు పథకం (Free Bus Scheme) తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ ఆఫర్ ప్రకటించినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులతో పాటు బస్సు కండక్టర్, డ్రైవర్లు పలు ఇబ్బందులు పడుతోన్న ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట చోటు చేసుకోవడం కనిపిస్తుంది.

TS RTC: Not only for women.. Reserve seats for men in buses?

ఇప్పటికే టికెట్ కొని ప్రయాణించే వారికి మహిళామణులు చుక్కలు చూపిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే తాజాగా తెలంగాణ (Telangana) ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్సు పథకంపై సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జారీ చేసిన జీవో 47ను సవాలు చేస్తూ ఎ.హరేందర్‌కుమార్‌ అనే ప్రైవేటు ఉద్యోగి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ జీవో జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఇది వివక్షతో కూడిన నిర్ణయమని పేర్కొన్నారు.. బస్సుల్లో ఉచితంతో ప్రయాణికుల సంఖ్య పెరగడంతో, అవసరాల కోసం వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని దాఖలు చేసిన వ్యాజ్యంలో వివరించారు..

ఇందులో ప్రతివాదులుగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఛైర్మన్‌తోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని చేర్చారు. కాగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్నికల ప్రచార సమయం లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. ఇప్పటికే సీట్ల కోసం జుట్లుపట్టి కొట్టుకొంటున్న సంఘటనలు రాష్ట్రంలో చర్చాంశనీయంగా మారాయి.. ఆటోలకు గిరాకీ తగ్గడంతో వారుసైతం వ్యతిరేకతను తెలియచేస్తున్నారు..

You may also like

Leave a Comment