Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
బీజేపీకి తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం కీలకంగా మారింది. గతంలో బీఆర్ఎస్ డామినేషన్ ఎక్కువగా ఉండేది.. అలాగే కాంగ్రెస్ సైతం పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. కాబట్టి బీజేపీకి పెద్దగా నష్టం లేదనే భావనలో ఉండేది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ హవా మొదలైంది. గెలుపు ఇచ్చిన్న కిక్కులో ఉన్న హస్తం లోక్ సభ ఎన్నికల్లో అదే ఊపు కంటిన్యూ చేస్తే.. కమలం భారీ మూల్యం చెల్లించుకొక తప్పదనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మే 3 వ తేదీన హైదరాబాద్ వచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల నుంచి సమాచారం.. మరోవైపు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నెల 18వ తేదీన నగర పర్యటనలో భాగంగా, విశ్రాంత ఆర్మీ అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ సైతం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ఆయన ఈ నెల 18వ తేదీన సాయంత్రం 4గంటలకు, రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొననున్నారు. అలాగే ఖమ్మంలో19వ తేదీన పర్యటించనున్నారు.. అదీగాక ఇదే రోజున మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, రాజస్థాన్ ముఖ్యమంత్రితో కలిసి నామినేషన్ దాఖలు చేయనున్నారు.. మొత్తానికి కాషాయం జండా దేశమంతా ఎగరేయాలని తాపత్రయపడుతున్న బీజేపీకి.. హస్తం ఏమేరకు పోటీ ఇస్తుందో చూడాలనుకొంటున్నారు..





