బాలీవుడ్ మోడల్, నటి పూనమ్ పాండే(Poonam Pandey) సర్వైకల్ క్యాన్సర్(Cervical cancer)తో మృతిచెందినట్లు గురువారం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది ఈ బాలీవుడ్ బ్యూటీ.
తాను చనిపోలేదని తెలుపుతూ పూనమ్ పాండే ఓ వీడియోను విడుదల చేసింది. సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకే తానీ పనిచేసినట్లు చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. పబ్లిసిటీ కోసం ఇంత దిగజారాలా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
శుక్రవారం పూనమ్ మృతిచెందిందని ఆమె మేనేజర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది పూనమ్ టీమ్. అయితే, పూనమ్ బతికే ఉందని బాలీవుడ్ సినీ విమర్శకుడు ఉమైర్ సంధు ముందే ట్వీట్ చేశాడు.
‘పూనమ్ బతికే ఉంది. ఆమె మరణ వార్తను ఆమె ఆనందిస్తోంది. ఆమె కజిన్‌తో నేను మాట్లాడా ఇదంతా పబ్లిసిటీ స్టంట్ మాత్రమే.’ అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. ఆ ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే పూనమ్ తాను బతికి ఉన్నానని వీడియో విడుదల చేయడం గమనార్హం.