Telugu News » గుంటూరు కారం సినిమాలో పవన్, చంద్రబాబు కి ఇచ్చిన ఇండైరెక్ట్ సపోర్ట్ గమనించారా?

గుంటూరు కారం సినిమాలో పవన్, చంద్రబాబు కి ఇచ్చిన ఇండైరెక్ట్ సపోర్ట్ గమనించారా?

గుంటూరు కారం సినిమాలో ఈ సన్నివేశాన్ని గమనించారా?

by Sri Lakshmi

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన సినిమా గుంటూరు కారం. ఎప్పటి నుంచి ఫాన్స్ ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు జనవరి పన్నెండున ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకులని అలరిస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో ఈ సినిమా గురించిన చర్చలే నడుస్తున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

క్రేజీ కాంబోలో రూపొందిన గుంటూరు కారం సినిమా అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా థియేటర్లలో సందడి చేస్తోంది. మూడు వేలకు పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదల అయ్యింది. ప్రీమియర్స్ షో నుంచే గుంటూరు కారం సినిమాకు డీసెంట్ టాక్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఏకంగా ఏకంగా రూ. 52.03 కోట్ల షేర్ రాబట్టింది. అయితే.. ఈ సినిమా రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ సినిమాలో డైరెక్టర్ త్రివిక్రమ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పరోక్షంగా సపోర్ట్ ఇచ్చారు అంటూ చర్చ నడుస్తోంది.

ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పార్టీ పేరు JDP (జనదళం పార్టీ). ఈ పార్టీ పేరు ని కావాలనే ఇలా పెట్టినట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ లోని J అనే లెటర్ ను, టీడీపీ పార్టీలోని DP అనే అక్షరాలను కలిపి జేడీపీ అనే పార్టీ పేరుని పెట్టినట్లు.. పరోక్షంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లకు సపోర్ట్ ఇవ్వడం కోసమే ఇలా పెట్టినట్లు తెలుస్తోంది. ఈ రకంగా తన ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ కు గురూజీ సపోర్ట్ ఇస్తున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

You may also like

Leave a Comment