Telugu News » TSRTC : సంక్రాంతి సందర్భంగా రికార్డు బద్దలు కొట్టిన టీఎస్‌ఆర్టీసీ..!!

TSRTC : సంక్రాంతి సందర్భంగా రికార్డు బద్దలు కొట్టిన టీఎస్‌ఆర్టీసీ..!!

సంక్రాంతి వేళ రద్దీని పర్యవేక్షించేందుకు TSRTC ముఖ్యమైన పాయింట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేసిన వాటిని బస్ భవన్‌లో ఉన్న ముఖ్య అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు సూచనలు, సలహాలు ఇస్తూ వచ్చారు.

by Venu
tsrtc-announced-special-discount-on-ticket-reservation-for-dussehra

తెలంగాణ (Telangana) ఆర్టీసీకి సంక్రాంతి పండుగ (Sankranti Festival) కాసుల వర్షం కురిపించింది. ఈ నెల 13 నుంచి 15 వ తేదీ వరకు 52లక్షల 78వేల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించగా, ఒక్కరోజే రికార్డు స్థాయిలో 12కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత ప్రయాణాన్ని మహిళలు భారీ సంఖ్యలో వినియోగించుకున్నట్లు ఆర్టీసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జీరో టికెట్లు 9 కోట్లు దాటిపోయినట్లు ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది.

TSRTC: TSRTC new record.. huge collections during festival..!

ప్రభుత్వం విద్యాసంస్థలకు పండుగ సెలవులు ప్రకటించింది. దీంతో ఉపాధి కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నగరంలో స్థిరపడిన వారు సొంత ఊర్లకు ప్రయాణం కట్టారు.. భారీ రద్దీ ఉంటుందని భావించిన TSRTC.. ప్రయాణీకుల సౌకర్యార్థం 6,261 ప్రత్యేక బస్సులను నడిపించగా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

మరోవైపు సంక్రాంతి వేళ రద్దీని పర్యవేక్షించేందుకు TSRTC ముఖ్యమైన పాయింట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేసిన వాటిని బస్ భవన్‌లో ఉన్న ముఖ్య అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు సూచనలు, సలహాలు ఇస్తూ వచ్చారు. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లినందునే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది.

సంక్రాంతి పండుగ వచ్చిందంటే బస్సులు, రైళ్లు, ప్రైవేట్ ట్రావెల్స్ కు కాసుల వర్షం కురుస్తుంది. ఇసుక పోస్తే రాలనంత జనం సొంత ఊర్లకు వెళ్ళడం కనిపిస్తుంది. సొంత వాహనాలు ఉన్న వారితో టోల్ గేట్లు సైతం నిండిపోయాయి.. నేటితో పండుగ సంబరం ముగియనుండటంతో జనం అంతా నగరబాట పట్టారు..

You may also like

Leave a Comment