Telugu News » TTD: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఎన్నికల వేళ టీటీడీ కీలక నిర్ణయం..!

TTD: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఎన్నికల వేళ టీటీడీ కీలక నిర్ణయం..!

లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections)కు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలైంది.

by Mano
TTD: Big alert for Srivari devotees.. TTD's key decision at the time of election..!

కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) శనివారం లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections)కు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలైంది. లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ(Assembly)లకూ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.  కేవలం రెండు నెలల సమయమే ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి. అయితే ఈ ఎన్నికల ప్రభావం తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి దర్శనాలపై పడింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

ఎన్నికల షెడ్యూల్ ఖరారు కావడంతో టీటీడీ వీఐపీల నుంచి సిఫారసు లేఖలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వాటి ద్వారా దర్శనాలు చేసే అవకాశం లేదని స్పష్టం చేసింది. అంతే కాకుండా సిఫారసు లేఖలపై కేటాయించే దర్శనం, వసతి కేటాయింపును తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.

అయితే, ప్రొటోకాల్ వీఐపీలు స్వయంగా వస్తేనే దర్శనం, వసతి సౌకర్యాన్ని కల్పిస్తామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవ‌ర‌కు ఏ రకమైన వ‌స‌తి, దర్శనాలకూ  సిఫారసు లేఖలు స్వీకరించబోమని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు, వీఐపీలు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు.

You may also like

Leave a Comment