Telugu News » అల్లు అరవింద్ వల్ల ఉదయ్ కిరణ్ ఈ బ్లాక్ బస్టర్ మూవీ లో ఛాన్స్ మిస్..! ఆ తరవాత ఇలా..!

అల్లు అరవింద్ వల్ల ఉదయ్ కిరణ్ ఈ బ్లాక్ బస్టర్ మూవీ లో ఛాన్స్ మిస్..! ఆ తరవాత ఇలా..!

by Sravya

ఉదయ్ కిరణ్ గురించి పరిచయం చేయక్కర్లేదు. ఉదయ్ కిరణ్ కూడా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చారు. మంచి నటుడుగా కొంతకాలానికి గుర్తింపుని తెచ్చుకున్నారు. అతి కొద్ది కాలంలో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఉదయ్ కిరణ్ అప్పట్లో యువతకి లవర్ బాయ్ గా చాక్లెట్ బాయ్ గా ఉండేవారు. ఆయన మరణానికి సంబంధించి ఇప్పటికీ ఎవరికి తోచిన కారణాలని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎవరు ఎన్ని కారణాలు చెప్పినా వాస్తవం ఏంటనేది మాత్రం ఉదయ్ కిరణ్ ఒక్కరికే తెలుసు.

ఉదయ్ కిరణ్ మరణించినప్పటి నుండి ఇప్పటిదాకా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో సైతం ఎవరికి నచ్చినట్లు వాళ్ళు రాస్తూనే ఉంటున్నారు. మురళీమోహన్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఉదయ్ కిరణ్ ముందు హీరోగా చేయాలని మురళీమోహన్ భావించారు ఆ విషయం ఉదయ్ కిరణ్తో ప్రస్తావించారు. అతను సినిమా చేయడానికి ఓకేనని మాట ఇచ్చారు ఉదయ్ కిరణ్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయడానికి కొంత సమయం పట్టింది ఈ లోపు ఉదయ్ కిరణ్ చిరంజీవి కూతురు సుష్మితతో వివాహం నిశ్చయమైంది. ఉదయ్ కిరణ్ కి సంబంధించిన అన్ని విషయాలు అల్లు అరవింద్ దగ్గర ఉండి చూసుకున్నారట.

Also read:

చివరికి అతను డేట్స్ కి సంబంధించిన డైరీ ని కూడా అరవింద్ దగ్గరే పెట్టుకున్నాడట అంతకు ముందు అతను సినిమా ఒప్పుకున్నాడు కాబట్టి మురళీమోహన్ వెళ్లి ఉదయ్ కిరణ్ డేట్స్ అడగ ఖాళీ లేవని అరవింద్ చెప్పారట. ఉదయ్ కిరణ్ ఏమి చేయలేకపోయినా పోయారట. దీంతో అతను సినిమా లో మహేష్ బాబు ని పెట్టారట. ఆ టైంలోనే పెళ్లి క్యాన్సిల్ అవ్వడంతో సినిమాలో అవకాశాలు పోయాయి. తర్వాత ఉదయ్ కిరణ్ ఇక లేరని ఆయన చెప్పారు.

 

You may also like

Leave a Comment