Telugu News » Uttam Kumar Reddy : గత ప్రభుత్వం చేసింది ఇదే.. ధాన్యం కొనుగోలుపై వివరణ ఇచ్చిన మంత్రి..

Uttam Kumar Reddy : గత ప్రభుత్వం చేసింది ఇదే.. ధాన్యం కొనుగోలుపై వివరణ ఇచ్చిన మంత్రి..

జీవన్ రెడ్డి నోటికి ఏది వస్తే అది మాట్లాడటం కాదు.. కాస్త గమనించి మాట్లాడాలని హితవుపలికారు.. అలాగే గత ఏడాది ఈ సమాయానికి సిద్దిపేటలో ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభం కాలేదని తెలిపిపారు.

by Venu
minister uttam kumar reddy said that lifts and check dams are incomplete in telangana

ధాన్యం కొనుగోలు అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మేము ధాన్యం కొనుగొలు చేసినంత నిజాయితీగా ఎవరు చేయలేదని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో మాట్లాడే వారికి అవగాహన లేదని మండిపడ్డారు.. ప్రతిపక్ష పార్టీలు బురద జల్లే మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు..

uttam kumar reddy fire on Brsఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అని ధీమా వ్యక్తం చేసిన ఉత్తమ్.. 270 స్థానాలకు పైగా మెజారిటీ సీట్లు గెలుస్తాం.. జూన్ 9వ తేదీన రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని జోస్యం చెప్పారు.. కాగా, ఏప్రిల్ 1వ తేదీ కంటే ముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపిన మంత్రి 6, 919 కేంద్రాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు.. అలాగే గత సంవత్సరం 335 కేంద్రాలు మాత్రమే ఓపెన్ అయినట్లు తెలిపారు..

ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం 2.7 లక్షల మెట్రిక్ టన్నులు.. లాస్ట్ ఇయర్ 230 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొన్నారని ఉత్తమ్ కుమార్ వివరించారు.. కేసీఆర్ (KCR) నిసిగ్గుగా మట్లాడుతున్నారని విమర్శించారు.. కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని ఈ సారి ముందే కొనుగోలు కేంద్రాలు తెరిచినట్లు పేర్కొన్నారు.. కానీ ప్రతిపక్ష పార్టీల నేతలు కాంగ్రెస్ (Congress)పై బురద జల్లె ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు..

జీవన్ రెడ్డి నోటికి ఏది వస్తే అది మాట్లాడటం కాదు.. కాస్త గమనించి మాట్లాడాలని హితవుపలికారు.. అలాగే గత ఏడాది ఈ సమాయానికి సిద్దిపేటలో ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభం కాలేదని తెలిపిన మంత్రి.. ఈ ఏడాది సిద్దిపేటలో 412 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, 824 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వివరించారు.. ధాన్యం కొనుగోలులో రైతులకు అన్యాయం జరగకుండా అన్ని చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు..

ఇందుకు కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.. అలాగే ధాన్యం కొనుగోలు తరువాత నేరుగా డబ్బులు రైతుల అకౌంట్లలో పడుతాయన్నారు.. మరోవైపు గత ప్రభుత్వంలో సన్న బియ్యానికి దొడ్డు బియ్యానికి తేడా లేకుండా టెండర్లు వేశారని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వేరు వేరు టెండర్ల ను పిలిచాం, దీని ద్వారా 11 వందల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి అదనంగా వచ్చిందని మంత్రి వెల్లడించారు.

You may also like

Leave a Comment