Telugu News » వెంకటేష్- నీరజల పెళ్లి వెనుక ఇంత కథేనా..? ఆమె బాక్గ్రౌండ్ తెలుసా..?

వెంకటేష్- నీరజల పెళ్లి వెనుక ఇంత కథేనా..? ఆమె బాక్గ్రౌండ్ తెలుసా..?

by Sravya
neeraja

విక్టరీ వెంకటేష్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు వెంకటేష్ తన సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపోయారు. వెంకటేష్ చాలా డిఫరెంట్ గా ఉంటారు. వెంకటేష్ ని చూస్తే హీరోలు ఇలా కూడా ఉంటారా అని అనిపిస్తూ ఉంటుంది. వెంకటేష్ మొట్టమొదట కలియుగ పాండవులు సినిమాలో నటించారు. ఇప్పటిదాకా ఎన్నో సినిమాలు చేశారు. కానీ వెంకటేష్ కు సంబంధించి ఎలాంటి రూమర్స్ కూడా రాలేదు. వెంకటేష్ భార్య నీరజ గురించి చాలామందికి తెలియని విషయాలు ఉన్నాయి. మరి వెంకటేష్ భార్య అయిన నీరజ కి సంబంధించిన కొన్ని విషయాలను ఇప్పుడు చూద్దాం.

వెంకటేష్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తారు. ఎప్పుడూ కూడా వెంకటేష్ తన భార్య పిల్లల గురించి ప్రస్తావించలేదు. నీరజ రెడ్డి గంగవరపు వెంకటసుబ్బారెడ్డి ఉషారాణి దంపతులకు పుట్టారు. చిత్తూరు జిల్లా మదనపల్లి వీళ్లది. నీరజ వాళ్ల కుటుంబం జమీందారీ కుటుంబం ఆమె తండ్రి పెద్ద భూస్వామి. ఎన్నో వ్యాపారాలు కూడా వాళ్లకి ఉన్నాయట. మదనపల్లిలో పేరు పలుకుబడి ఉన్న వ్యక్తి సుబ్బారెడ్డి.

Also read:

ఒకానొక సమయంలో రామానాయుడు వెంకటేష్ కి పెళ్లి చేయాలని అమ్మాయి ఎవరైనా ఉంటే చూడమని విజయ నాగిరెడ్డికి చెప్పగానే నీరజ గురించి చెప్పారు. నీరజ అమ్మమ్మ గారిది కృష్ణాజిల్లా దగ్గర వరాహపట్నం సెలవులప్పుడు నీరజ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేదట. నీరజ మేన మామ కామినేని శ్రీనివాసరావు 2014లో బిజెపి తరఫున కైకలూరు ఎమ్మెల్యేగా గెలిచారు చంద్రబాబునాయుడు క్యాబినెట్లో ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు నీరజా ఎంబీఏ పూర్తి చేశారు. ముందు రామానాయుడు మదనపల్లి వెళ్లి నీరజని చూశారు తర్వాత పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు ఇరువురికి ఇష్టం అన్నాక అప్పుడు పెళ్లి చేశారు.

You may also like

Leave a Comment