Telugu News » ఆర్జీవీ వ్యూహంలో విలన్ ఎవరు..? ఆర్జీవీ మెగా ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టబోతున్నాడా..?

ఆర్జీవీ వ్యూహంలో విలన్ ఎవరు..? ఆర్జీవీ మెగా ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టబోతున్నాడా..?

RGV వ్యూహం సినిమాలో విలన్ అతనేనా ? వర్మ మెగా ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెడుతున్నారా?

by Sravya

రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్తతో సంచలనంగా నిలుస్తారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన వ్యూహం సినిమా కొన్ని రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది ఈ సినిమాలో చంద్రబాబు విలన్ అని అంతా భావించారు. అయితే సమాచారం ప్రకారం చిరంజీవిని ఈ సినిమాలో విలన్ గా చూపించే విధంగా ట్రై చేసినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న వర్మ ప్రస్తుతం పొలిటికల్ సినిమాలను తీస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

అయితే వర్మకి భారీ స్థాయిలోనే పారితోషకం వస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన పొత్తు నేపథ్యంలో చిరు సొంత పార్టీ అయిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం వల్లే జనసేన ఆవిర్భావం జరిగిందని… పవన్ పొలిటికల్ లైఫ్ విషయాలలో విమర్శలు ఎదుర్కోవడానికి చిరంజీవి కారణమని అభిప్రాయాన్ని తీసుకువచ్చే విధంగా సినిమాలో చూపించనున్నారు. మెగా ఫాన్స్ కి చిరాకు కోపం కలిగే విధంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Also read:

వ్యూహం సినిమా సక్సెస్ సాధించకపోయినా శపథం సినిమాని కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇక మీదట వర్మ పొలిటికల్ సినిమాలు చేయనని చెప్పిన సంగతి తెలిసిందే. వర్మ ఇచ్చిన మాట మీద నిలబడతారని ఎవరూ కూడా నమ్మరు. రామ్ గోపాల్ వర్మ మరి రాబోయే రోజుల్లో ఎటువంటి సినిమాలు తీస్తారు..?, ఎలాంటి ఫలితం రాబోతోంది అనేది చూడాలి. వర్మ ఇక మీదట పొలిటికల్ సినిమాలు చేయనని చెప్పారు మరి ఆ మాట మీద నిలబడతారా లేదా అనేది చూడాలి. ఆయన మాత్రం మంచి విజయాలని అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

You may also like

Leave a Comment