Telugu News » పవన్ కళ్యాణ్ షార్ట్ ఫిల్మ్ గురించి మీకు తెలుసా..? ఆ షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ ఏమిటంటే..?

పవన్ కళ్యాణ్ షార్ట్ ఫిల్మ్ గురించి మీకు తెలుసా..? ఆ షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ ఏమిటంటే..?

by Sravya

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతో, ఇంకో పక్క పాలిటిక్స్ తో బిజీగా ఉంటున్నారు. 2024 సంవత్సరంలో సినిమాల్లో రాజకీయాల్లో కూడా సక్సెస్ అవుతారని ఫాన్స్ అయితే ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరియర్ మొదట్లో డైరెక్టర్ అవ్వాలని అనుకున్నారు. కానీ కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. డైరెక్టర్ అవ్వాలని పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చిన మొదట్లో షార్ట్ ఫిలిం ని కూడా తీసారట. న్యూయార్క్ ఫిలిం అకాడమీ లో షార్ట్ టర్మ్ కోర్స్ కూడా కోసం కూడా పవన్ కళ్యాణ్ దరఖాస్తు చేసుకోవడంతో పాటుగా ఒక షార్ట్ ఫిలిం ని కూడా పంపారు.

అంధుల గురించి షార్ట్ ఫిలిం తీసిన పవన్ కళ్యాణ్ న్యూ ఇయర్ ఫిలిం అకాడమీలో ఫీజులు ఎక్కువగా ఉండడం వలన ఇతర కారణాల వలన వెనుకడుగు వేశారు. కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా ఆయన అడుగులు వేయాలని అనుకోలేదు. అందుకని నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ షార్ట్ ఫిలిం ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటులో లేదు. ఈ సినిమాని అందుబాటులోకి తెస్తే బాగుంటుందని నెటిజెన్లు అనుకుంటున్నారు.

Also read:

పవన్ కళ్యాణ్ వరుస సినిమాలలో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ షూటింగ్ లు మాత్రం బాగా లేట్ అవుతున్నాయి. ఈ రీజన్ వలన పవన్ సినిమాలు రిలీజ్ డేట్ లో మార్పులు చేస్తున్నారు.  పవన్ వచ్చి ఏడాదికి మూడు సినిమాలని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పవన్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న దర్శకులు కూడా క్రేజ్ ఉన్న డైరెక్టర్లు అవ్వడంతో ఈ సినిమాలపై అంచనాలని పెంచుతున్నారు. ఫ్యాన్స్ ఎంతో సంతోషపడుతున్నారు. పవన్ కళ్యాణ్ మూడు సినిమాల బడ్జెట్ 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెర మీదకి వస్తున్నాయి పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేయడంతో అభిమానులు కూడా హ్యాపీగానే ఉంటున్నారు.

You may also like

Leave a Comment