బెంగుళూరులోని చిన్నస్వామి మైదానం(chinnaswamy stadium)లో ఆదివారం నెదర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో టీమిండియా(Team India) గ్రాండ్ విక్టరీ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) బ్యాట్‌తోనే కాదు.. బాల్‌తోనూ తన బౌలింగ్ స్కిల్స్‌ను నిరూపించుకున్నాడు.
నెదర్లాండ్స్(Netherlands)తో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన విరాట్ కోహ్లీ సారథి స్కాట్ ఎడ్వర్డ్స్ వికెట్ తీశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీకి 9 ఏళ్ల తర్వాత ఇదే తొలి వికెట్ కావడం గమనార్హం. కోహ్లీ చివరిసారిగా 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత వికెట్ తీయడం ఇదే తొలిసారి. కోహ్లీ వికెట్ తీసిన అనంతరం అనుష్కశర్మ లేచి నిలబడి సంబరపడిపోయింది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీ వన్డేల్లో వికెట్ పడగొట్టడం చాలా అరుదు. తొమ్మిదేళ్ల తర్వాత ఎట్టకేలకు వికెట్ తీయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 2014లో వన్డేల్లో విరాట్ వికెట్ తీశాడు. ఇదివరకు అలిస్టర్, కుక్, క్రెయిగ్ కీస్వెటర్, బ్రెండర్ మెకల్లమ్, క్వింటన్ డికాక్‌ల వికెట్లు పడగొట్టాడు.
నెదర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏకంగా160 పరుగుల తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి ఏకంగా 410 పరుగులు చేసింది. నెదర్లాండ్ జట్టు 250 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. భారత్ తరఫున 9మంది బౌలింగ్ వేశారు. అందులో కోహ్లీకి 3ఓవర్లు బౌలింగ్ వేసే అవకాశం వచ్చింది. ఇందులో నెదర్లాండ్ 13 పరుగులే చేసింది.