ఫలక్ నామా దాస్, హిట్, దాస్ కా దమ్కీ వంటి సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్సం పాదించుకున్నాడు యంగ్ హీరో విశ్వక్‌సేన్(Vishwaksen). ఏదైనా విషయాన్ని ముక్కుసూటిగా చెప్పే విశ్వక్‌సేన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ హీరో నటించిన కొత్త సినిమా ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’(Gang Of Godavari). కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదలను ఉద్దేశించి విశ్వక్ సేన్ ఆసక్తికర పోస్ట్ చేశారు.
‘సినీ పరిశ్రమలో బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే ఇబ్బందిపెట్టాలనే చూస్తుంటారని అన్నారు. మా సినిమా మొదట ఏ డేట్ అనుకున్నామో.. అదే డేట్‌కి విడుదలవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. ‘బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే ప్రతి ఒక్కడూ మన గేమ్ మారుద్దాం అనుకుంటాడు. ఈ సినిమా కోసం ప్రతి ఫ్రేమ్‌లో ప్రాణం పెట్టి పనిచేసి చెప్తున్నా. డిసెంబర్ 8న వస్తున్నాం. ఆరోజు మా సినిమా విడుదల కాకపోతే ఇకపై నన్ను ప్రమోషన్స్‌లో కూడా చూడరు’ అంటూ విశ్వక్ కీలక వ్యాఖ్యలు చేయడంతో నెట్టింట చర్చనీయాంశమయ్యాయి.
హిట్, ఫ్లాప్, సూపర్‌హిట్, డిజాస్టర్ ఏదనేది ప్రేక్షకుల నిర్ణయమని చెప్పిన విశ్వక్ సేన్.. ఆవేశంతోనో లేదా అహంకారంతోనో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం లేదని తెలిపాడు. మంచి కోసం తగ్గేకొద్దీ మనల్ని ఇబ్బందిపెట్టాలని చూస్తుంటారని తనకు అర్థమైందని పేర్కొన్నాడు. ‘డిసెంబర్ 8న సివాలెత్తిపోద్ది. గంగమ్మతల్లిపై ఒట్టు. మహాకాళి మాతో ఉంది.’ అని పోస్ట్ చేశారు.
‘దాస్ కా ధమ్కీ’ తర్వాత విశ్వక్ సేన్ నటిస్తోన్న చిత్రమిది. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. డిసెంబర్ 8న ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. అదే సమయంలో నితిన్ ‘ఎక్స్‌ట్రా’, వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ సైతం రిలీజ్ కానుండడంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ని వాయిదా వేసే ఆలోచనలో చిత్రబృందం ఉందని, ఈ విషయంపై విశ్వక్ అసహనానికి లోనయ్యారని వార్తలు వస్తున్నాయి.