Telugu News » ఉండేది బెంగుళూరు..ప్రతినెలా ప్రకాశంలో శాలరీ…!?

ఉండేది బెంగుళూరు..ప్రతినెలా ప్రకాశంలో శాలరీ…!?

వాలంటీర్ రబ్బర్ ఫింగర్ కహానీ..!

by sai krishna

పరిపాలనా సౌలభ్యానికి, ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయికి చేర్చేందుకు ఏపీ ఏర్పాటు చేసిన సరికొత్త సేవాదళం వాలంటీర్ వ్యవస్థ. ప్రజలకు రైట్ లో రావాల్సిన బెనిఫిట్స్ నేరుగా తెచ్చి డోర్ కొట్టి అందించడం ప్రధానోద్దేశం.ప్రభుత్వ ఉద్దేశం మంచిదే.! కొత్తలో బాగానే నడిచింది.

కానీ కొంతకాలంగా ఈ వ్యవస్థ ప్రజలకు పాత అవస్థలే తెరపైకి తెచ్చినట్టు విమర్శులు వస్తున్నాయ్. వైజాగ్ లో ఓ వాలంటీర్ అదును చూసి ఒంటరి వృద్ధులరాలిని హత్యచేశాడు, ఇంకో వాలంటీర్ జనానికి పంచాల్సిన పింఛన్ డబ్బులతో గర్ల్ ఫ్రెండ్ ని తీసుకుని గోవా చెక్కేశాడు.

మరో వాలంటీర్ వ్యక్తిగత కక్షతో అర్హులకు అందాల్సిన పథకాలకు రాజకీయం అడ్డంపెట్టాడు. తాజాగా ఇంకో వాలంటీరు బెంగుళూరులో ఉంటూ ఇక్కడ బయోమెట్రిక్ వేస్తున్నట్టుగా కథనడిపిస్తున్నాడు.

వివరాల్లోకి వెళితే ..ప్రకాశం జిల్లా పామూరు మండలం కట్టకిందపల్లి గ్రామ సచివాలయ పరిధిలోని కందులవారిపల్లిలో గురుప్రసాద్ అనే వ్యక్తి వాలంటీర్‌గా పని చేస్తున్నాడు.

నిజానికి అతను ఉండేది బెంగుళూరులో.. కానీ ఇక్కడ గ్రామంలో వృద్ధాప్య పింఛన్, వితంతు పింఛన్ పంపిణీ వంటి కార్యకలాపాలు మాత్రం యథావిధిగా సాగుతూనే ఉంటాయి. మరి పింఛన్ ఇవ్వడానికి వేలిముద్రలు ఎక్కడి నుంచి వస్తాయని మీకు డౌట్ వచ్చిందా.. !అదే మనోడి మేజిక్కు.!!

గురుప్రసాద్కు టెక్నాలజీ మీద పట్టుంది.దీంతో వేలిముద్రలతో కూడిన ఓ కృత్రిమ రబ్బరు వేలును తయారు చేశాడు.దానిని తన కుటుంబ సభ్యులకు అప్పజెప్పి బెంగుళూరులో దర్జాగా ఉంటున్నాడు.

వాళ్లు ఆ రబ్బరు వేలిముద్ర సాయంతో.. పింఛన్లు ఇస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా గత కొంతకాలంగా ఈ తంతు కొనసాగుతోంది. ఇదేమిటని ప్రశ్నించిన అవ్వ తాతలకు ఆ నెలలో పింఛన్ నిలిపివేస్తున్నారు.

ఈ నెలలో కూడా కొందరికి అలా పింఛన్‌ నిలిపివేయగా..ఈ రబ్బర్ వేలు తతంగం వెలుగులోకి వచ్చింది. పింఛన్‌దారులు స్థానిక సచివాలయం వద్దకు చేరుకొని ఆందోళన చేశారు. స్పందించిన సచివాలయ అడ్మిన్.. వాలంటీర్‌ లేకుండా పింఛన్ల పంపిణీ జరగడం నిజమేనని తేలిందన్నారు.

 

You may also like

Leave a Comment