Telugu News » లండన్ వీధుల్లో తళుక్కుమంటున్న…సితార.!

లండన్ వీధుల్లో తళుక్కుమంటున్న…సితార.!

డాటర్ ఆఫ్ ప్రిన్స్ వైరల్ పిక్స్

by sai krishna

ప్రిన్స్ మహేశ్ విదేశాలు చుట్టేస్తున్నారు. షూటింగ్ గ్యాప్పో..ఫ్యామిలీ ట్రిప్పో తెలియదు కానీ.. భార్య నమ్రత,కొడుకు గౌతమ్,కూతురు సితారలతో కలిసి ఫారన్ లొకేషన్స్ మినిట్ టూ మినిట్..స్పాట్ టూ స్పాట్ ఫుల్ గా కవర్ చేస్తున్నారు.

కూతురు సితారైతే లండన్ వీధుల్లో నడిచే నక్షత్రంలా మెరిసిపోతోంది.చిరు నవ్వులొలికిస్తూ చక్కగా చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఆమె స్మైలీ స్టైలిష్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ట్రెండీ వేర్ లో కలర్ ఫుల్ లుక్ లో సితార ఆకట్టుకుంటోంది. మరోవైపు చిన్న వయసులో సితార సెలెబ్రిటీ స్టేటస్ ను అందుకుంది. ఓ ఇంటర్నేషనల్ జువెలరీ బ్రాండ్ కు ఆమె బ్రాండ్ అంబాసడర్ గా ఉంది.

న్యూయార్క్ లోని టైమ్స్ స్వ్కేర్ లో కూడా ఆమె హోర్డింగ్స్ ను ప్రదర్శించారు. ఈ యాడ్ కు ఆమె కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. తన తొలి సంపాదనను సితార ఒక ఛారిటీకి డొనేట్ చేసింది.

You may also like

Leave a Comment