Telugu News » What should I eat: మనం ఏం తినాలో కూడా జొమాటోని అడగొచ్చు

What should I eat: మనం ఏం తినాలో కూడా జొమాటోని అడగొచ్చు

ఏం తింటే బాగుంటుందో, మనకు ఎన్ని క్యాలరీల ఫుడ్ అవసరమో వంటి వివరాలను జొమాటో తాజా ప్రవేశపెట్టిన పర్సనల్ చాట్ బాట్ ద్వారా అడగొచ్చు.

by Prasanna
zomato food delivery

బాగా ఆకలేసి అర్జెంటుగా ఫుడ్ (Food) కావాలంటే…జొమాటో (Zomato) వంటి ఫుడ్ యాప్స్ ని ఆశ్రయిస్తాం. ఫుడ్ డెలివరీయే కాకుండా మన ఆరోగ్య(Health) రీత్యా మనం ఏం తినాలో కూడా ఇప్పుడు జొమాటోని అడొగొచ్చు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో సాధ్యం. జొమాటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను తమ కస్టమర్ల (Customers)కు అందుబాటులోకి తెచ్చింది.

zomato food delivery

ప్రస్తుతం అన్ని రంగాల్లో, విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా మొదలైన కాలమిది. ఇది ఫుడ్ డెలివరీ సంస్థలకూ వ్యాపించింది. మన ఆరోగ్య రీత్యా ఏం తినాలో, ప్రస్తుతం మనమున్న వాతావరణంలో ఏం తింటే బాగుంటుందో, మనకు ఎన్ని క్యాలరీల ఫుడ్ అవసరమో వంటి వివరాలను జొమాటో తాజా ప్రవేశపెట్టిన పర్సనల్ చాట్ బాట్ ద్వారా అడగొచ్చు. ఈ ప్రశ్నలకు వెంటనే మనకు సమాధానం దొరుకుతుంది. వెంటనే దానికి తగిన విధంగా మనం ఆర్డర్స్ పెట్టుకోవచ్చు.

జొమాటో ఏఐ సేవలను ప్రారంభిస్తూ అందులో చాట్ బాత్ ఆప్షన్ ను తీసుకొచ్చింది. జొమాటో కస్టమర్లు ఆహార పదార్థాలను ఎంచుకోవడంలో సహాయ పడేందుకు ఈ పర్సనల్ చాట్ బాట్ అప్షన్ తీసుకొచ్చినట్లు జొమాటో ప్రతినిధులు తెలిపారు.

ఈ చాట్ బాట్ ద్వారా కస్టమర్ల ప్రశ్నలకు తగిన విధంగా ఉండే వంటకాలు ఏయే హోటలలో దొరుకుతాయో కూడా లిస్టు చూపిస్తుంది. అయితే ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తున్న చాట్ బాట్ అప్షన్ ను వాడుకోవాలంటే  జొమాటో గోల్డ్ కస్టమర్లై ఉండాలని ఆ సంస్థ తెలిపింది. భవిష్యత్తులో మరింత మంది కస్టమర్లకు దీనిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది.

You may also like

Leave a Comment