హనుమాన్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించే వినిపిస్తోంది. హనుమాన్ సినిమాలో హీరోగా తేజ సజ్జా, హీరోయిన్ గా అమృత అయ్యర్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయ్యి మూడు వారాలు దాటుతున్నా కలెక్షన్స్ వర్షం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవలే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో.. సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. హనుమాన్ సినిమా విజయంపై ఈ మీట్ లో అందరు హర్షం వ్యక్తం చేసారు.
ఈ ఈవెంట్ లో ఓ వ్యక్తి మాత్రం చాలా స్పెషల్ గా నిలిచారు. ఈ వ్యక్తికీ ప్రశాంత్ వర్మ లైఫ్ లో కూడా ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇంతకీ ఈ వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రశాంత్ వర్మ కు సినిమాల పిచ్చి బాగానే ఉంది. ఇండస్ట్రీ లోకి రాక ముందు ఆయన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసేవారట. అయితే.. సినిమాలపై ఉన్న ఇంటరెస్ట్ కొద్దీ.. షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ సినిమా ఇండస్ట్రీ లోకి రావడానికి ప్రయత్నాలు చేసేవారు. సినిమాల్లోకి వచ్చేటప్పటికే ఆయనకు వివాహం అయిపొయింది కూడా.
హనుమాన్ సక్సెస్ ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆ వ్యక్తి మరెవరో కాదు. ఆయన భార్య సుకన్య. కోవిడ్ సమయంలోనే ఈ జంటకు వివాహం జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమే. కానీ, అప్పటికి ప్రశాంత్ వర్మ పెద్ద డైరెక్టర్ కాకపోవడంతో ఆయన వివాహం గురించి తెలియలేదు. అ! సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యిన ప్రశాంత్ వర్మ కల్కి, జాంబిరెడ్డి సినిమాలతో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. హనుమాన్ సినిమాతో మొత్తం ఇండియాను షేక్ చేసారు. ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ సందర్భంగా తన భార్య సుకన్యని పరిచయం చేసారు. ఓ డైరెక్టర్ ఎదగడం వెనుక తన తోడ్పాటు ఉందని, అందుకు థాంక్స్ తెలిపారు. ఆమె కూడా చాలా అందంగా ఉండడంతో.. వారిద్దరిని చూసిన నెటిజన్స్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని కామెంట్స్ చేస్తున్నారు.