నటి అమల గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. అలానే నాగార్జున కూడా మన అందరికీ సుపరిచితమే. అక్కినేని నాగేశ్వరరావు సినీ ఇండస్ట్రీలో, స్టార్ హీరోగా మంచి సక్సెస్ ని అందుకున్నారు. నాగేశ్వరరావు వారసుడిగా నాగార్జున ఇండస్ట్రీలోకి వచ్చే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అమలని రెండవ పెళ్లి చేసుకున్నారు నాగార్జున. ఈ దంపతులకు అఖిల్ పుట్టారు. హీరోగా ఇప్పటికే ఐదు సినిమాలు చేశారు అఖిల్ కానీ సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగలేకపోతున్నాడు.
ఐదు నెలల వయసులో ఉన్నప్పుడే అఖిల్ సిసింద్రీ సినిమాలో బాల నటుడిగా కనపడి అందరినీ షాక్ కి గురి చేసాడు ఈ సినిమాలో నాగార్జున ఆమని హీరో హీరోయిన్లుగా నటించడం జరిగింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక విషయాన్ని చెప్పారు. అంత చిన్న పిల్లాడిని సినిమా ఇండస్ట్రోకి తీసుకురావాలనే ఆలోచన ఎందుకొచ్చింది…?, అసలు అఖిల్ సినిమా షూటింగ్లో ఎలా పాల్గొన్నారు..? డైరెక్టర్ నాగేశ్వరరావు గారు ఇంటికి వచ్చి సిసింద్రీ సినిమా చేస్తున్నాము, అబ్బాయి డేట్స్ కావాలని అడిగారట. అయితే అమలకు కోపం వచ్చి ఆయన మొహం మీదే తలుపులు వేసేసారట. తలుపులు వేసేయడంతో ఆయన నాగార్జునని కలిశారని నాగార్జున తో స్టోరీ మొత్తం చెప్పారట.
Also read:
కథ బాగా అనిపించిందని అమల దగ్గరికి వెళ్లి ఈ విషయం గురించి నాగార్జున మాట్లాడారట. అమల, అఖిల్ సిసింద్రీ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. కేవలం బ్లూ క్రాస్ వల్ల మాత్రమేనని నాగార్జున చెప్పారు. అప్పుడే అమల బ్లూ క్రాస్ ని స్థాపించింది. అందుకోసం ఫండ్స్ కావాలి ఒక సినిమా చేసి ఆ డబ్బులు తనకి ఇవ్వచ్చు కానీ అఖిల్ సినిమా చూసి ఆ సినిమాకి వచ్చిన డబ్బు బ్లూ క్రాస్ సంస్థకి పేరు పెడితే పేరు ఉండిపోతుంది కదా అని నాగార్జున అమల కి చెప్పగా, అమలు ఒప్పుకున్నారట. ఈ కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతోంది. సిసింద్రీ సినిమా షూటింగ్ టైంలో తనతో పాటుగా రోజు అమలు కూడా షూటింగ్ లోకేషన్ లకి వచ్చి మేనేజ్ చేసేది. షూటింగ్ కారణంగా నాకు అఖిల్ మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని నాగార్జున అన్నారు.