Telugu News » కొడుకులు, కూతుళ్లు, మనవరాళ్లకి ఎన్టీఆర్ పెట్టిన పేర్లు వెనుక.. ఇంత స్టోరీనా..?

కొడుకులు, కూతుళ్లు, మనవరాళ్లకి ఎన్టీఆర్ పెట్టిన పేర్లు వెనుక.. ఇంత స్టోరీనా..?

by Sravya
ntr-family

ఎన్టీఆర్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు నందమూరి తారక రామారావు గారు రాజకీయ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసి ఎన్నో పథకాలను కూడా తీసుకు వచ్చారు ఇప్పటికి కూడా చాలా మంది పేద ప్రజలు ఎన్టీఆర్ ని దేవుడుగా భావిస్తారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ విషయానికి వస్తే.. ఎన్టీఆర్ బసవతారకాన్ని పెళ్లి చేసుకున్నాక ఎనిమిది మంది అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు పుట్టారు. ఎన్టీఆర్ కి తెలుగు భాష అంటే ఎంతో గౌరవం హిందూధర్మం అన్నా ఆచారాలు అన్నా సంప్రదాయాలు అన్నా కూడా ఆయనకి గౌరవం.

ఎక్కువ ఎన్టీఆర్ తన పిల్లలకి చివర ప్రాస కుదిరే విధంగా పేర్లు పెట్టారు. ఏడుగురు కొడుకుల పేర్లు చివర కృష్ణ అనే పదం ఉండే విధంగా పేరు పెట్టారు. హరికృష్ణ, రామకృష్ణ, సాయి కృష్ణ, జయ కృష్ణ, బాలకృష్ణ అని. కూతుళ్ళకి చివరి ఈశ్వరి ఉండే విధంగా పేర్లు పెట్టారు. లోకేశ్వరి, పురందేశ్వరి, ఉమామహేశ్వరి, భువనేశ్వరి అని.

Also read:

brahmani tdp 2

రెండవ తరంలో కూడా ఎన్టీఆర్ పెట్టిన పేర్లు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఎన్టీఆర్ తన పెద్ద కొడుకు జయకృష్ణ కూతురు పేరు కుదిమినీ రెండవ కూతురు పేరు శ్రీమంతుని మనస్విని అని పెట్టారు. బాలకృష్ణ ఇద్దరు కూతుళ్లు బ్రాహ్మణి, తేజస్విని అని పెట్టారు. చిన్న కొడుకు సాయి కృష్ణ కూతురికి ఈషాణి అని పెట్టారు ఇలా ఎన్టీఆర్ పెట్టిన పేర్లు చూస్తే ఎంత కళాత్మక హృదయము అనేది అర్థం అవుతుంది.

You may also like

Leave a Comment