దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఓ పాన్ ఇండియా రేంజ్ హీరో కంటే ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్న డైరెక్టర్ గా రాజమౌళి పేరు తెచ్చుకున్నారు. ఈయన సినిమా తీశారు అంటే అది పక్కా హిట్ అవుతుంది అన్న టాక్ సినిమా ఇండస్ట్రీలో ఉండి. ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్ గా రాజమౌళి పేరు తెచ్చుకున్నారు. అయితే.. రాజమౌళికి హీరో ప్రభాస్, ఎన్టీఆర్ లతో ప్రత్యేక బాండింగ్ ఉంది. వీరిద్దరికి కెరీర్ ప్రారంభంలో రాజమౌళి ఛత్రపతి, యమదొంగ లాంటి హిట్స్ ఇచ్చారు.
అయితే.. ఛత్రపతి సినిమా తరువాత రాజమౌళి ప్రభాస్ మరియు ఎన్టీఆర్ లతో ఓ సినిమా తీయాలని అనుకున్నారట. ఈ మల్టీ స్టారర్ సినిమా కోసం రాజమౌళి చాలా ప్లాన్స్ నే వేసుకున్నారట. కానీ, అప్పటి ప్రేక్షకుల ఆలోచన ధోరణి గురించి ఆలోచించి.. ఒక హీరోని ఎక్కువగా చూపించారు.. మరో హీరోని తక్కువ చేసారు అంటూ.. విపరీతంగా ఫ్యాన్ వార్స్, అనవసర గొడవలు జరుగుతాయి అని ఆలోచించిన రాజమౌళి ఈ సినిమా గురించిన ఆలోచనని వదులుకున్నారట.
కానీ, చాలా గ్యాప్ తీసుకున్న తరువాత పక్కాగా స్క్రిప్ట్, ప్లాన్స్ ను సిద్ధం చేసుకుని రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కాంబోలో ఆర్ ఆర్ ఆర్ సినిమా తీసి రికార్డులు సృష్టించారు. మొత్తానికి తానూ అనుకున్న కలనీ అయితే రాజమౌళి నెరవేర్చేసుకున్నారు. అయితే.. ఆర్ ఆర్ ఆర్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు కూడా లభించింది.