Telugu News » Elephant hunt : సందర్శకులను టార్గెట్ చేసిన ఏనుగు…తర్వాత ఏమైందంటే..!

Elephant hunt : సందర్శకులను టార్గెట్ చేసిన ఏనుగు…తర్వాత ఏమైందంటే..!

కర్ణాటక(Karnataka)లోని మైసూర్ జిల్లాలో ఉన్న నాగర్ హోల్ నేషనల్ పార్క్(Nagarhole National Park)లో ఓ ఏనుగు హల్ చల్ చేసింది. పర్యాటకుల వాహనాలపై దాడి చేసేందుకు ప్రయత్నించింది.

by sai krishna

కర్ణాటక(Karnataka)లోని మైసూర్ జిల్లాలో ఉన్న నాగర్ హోల్ నేషనల్ పార్క్(Nagarhole National Park)లో ఓ ఏనుగు హల్ చల్ చేసింది. పర్యాటకుల వాహనాలపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. కొంత దూరం పర్యటకుల వాహనాలను వెంబడించింది.

తొలుత ఓ సఫారీ వాహనాన్ని తరిమగా వాహనాన్ని రివర్స్లో పోనిచ్చాడు డ్రైవర్ అనంతరం మరో వైపు వస్తున్న పర్యటకుల వాహనాన్ని కూడా వెంబడించసాగింది. దీంతో ఆ వాహనాన్ని కూడా వెనక్కి పోనిచ్చాడు డ్రైవర్.వాహనాలను ఏనుగు తరుముతున్న దృశ్యాలను ఓ పర్యాటకుడు వీడియో తీశాడు.రెండు వాహనాలను తరిమిన అనంతరం తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది.


కొద్ది రోజుల క్రితం కూడా కేరళ(Kerala)లోని వయనాడ్ ( Wayanad)లో ముథంగ-బందీపుర్ ప్రాంతంలో ఓ ఏనుగు ఇలాగే ప్రపర్తించింది. వయనాడ్ అభయారణ్యంలో బైకర్లపైకి దూసుకెళ్లింది. ఏనుగును చూసి బైకర్లు రోడ్డుపైనే ఆగిపోగా..అదేసమయంలో గజరాజు వారిపైకి దూసుకొచ్చింది.

భయభ్రాంతులకు లోనైన యువకుడు వెంటనే అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు. ద్విచక్రవాహనంపై ఉన్న మరో వ్యక్తి తన బైక్ను అడవిలోకి పోనిచ్చాడు. అలా వాహనదారులు ఏనుగు దాడి నుంచి తమ ప్రాణాలు కాపాడుకున్నారు.

You may also like

Leave a Comment