Telugu News » బ్రో ఇట్స్ ‘ఓజీ’ టైమ్..రిలీజ్ ఎప్పుడంటున్నారంటే …!

బ్రో ఇట్స్ ‘ఓజీ’ టైమ్..రిలీజ్ ఎప్పుడంటున్నారంటే …!

by sai krishna

పవన్ పాలిటిక్స్ పడవ ఇప్పట్లో దిగేలా లేడు అనుకున్నారంతా.! అంత బిజీలో కూడా పక్కాగా సినిమా పడవెక్కి బ్రో సినిమా చించి అవతల పడేశాడు పవర్ స్టార్.ఇప్పడది పవన్ కి ఉన్న ఫ్యాన్ బేస్ ని క్రౌడ్ పుల్లింగ్ చేసేపనిలో ఉంది.

అయితే ఇదే లైన్ లో మరికొన్ని కమిటెడ్ సినిమాలు కూడా ఉన్నాయని టాక్. పవన్ బిజీ లైఫ్ గురించి తెలిసిందే..ఈ గందరగోళంలో ఏ సినిమా సెట్లో ప్రాణం పోసుకుంటుందనేదే పాయింటు.పవర్ స్టార్ వెంటబడుతున్న సినిమా లిస్టులో హరిహరవీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్న విషయం తెలిసిందే.

వీటిలో హరిహరవీరమల్లు సినిమా ఇప్పటలో రావడం కష్టంగానే కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కంటే ముందు రావడానికి ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ లు నేను ముందంటే నేను ముందని ఫ్యాన్స్ ముందుకు రావడానికి పోట్లాడుకుంటున్నాయి.

అయితే ఈ క్రేజీ క్వారలింగ్ లో ఉస్తాద్ వెనకబడినట్టు కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో గబ్బర్ సింగ్ సినిమా ఒకటి. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. హరీష్ డైరెక్షన్ లో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ వెనకబడ్డాడని సినీవర్గాలు.

ఉస్తాద్ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ ఓజీ అనే సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇంచు మించుగా ఉస్తాద్ తో పోటీపడి స్ట్రైకింగ్ మే’కింగి’ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ సగం వరకు షూట్ జరిగిందని తెలుస్తోంది. మొన్నటి దాకా షెడ్యూల్స్ మొహం చూడని ఓజీ. పవన్ డేట్స్ లైన్ డేట్స్ లా అందుకుని గుటుక్కున మింగేస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి క్రేజీ ఒకటి బయటకు వచ్చింది. ఈ మూవీ షూటింగ్ చకచకా కంప్లీట్ చేయనున్నారు.ఈ మూవీ నుంచి త్వరలో గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు.ఇదిలా ఉంటే ఉస్తాద్ కంటే ముందుగానే ఓజీ సినిమా థియేటర్స్ లోకి వస్తుందని టాక్ వినిపిస్తుంది.

ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఓజీ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. అలాగే ఉస్తాద్ ను వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

‘సాహో’ సినిమాతర్వాత సుజిత్ చేస్తున్న మూవీ కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాలంటే అఫీషియల్ అప్డేట్స్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

You may also like

Leave a Comment