Telugu News » Helmets : ఇది బాధల తెలంగాణ!

Helmets : ఇది బాధల తెలంగాణ!

పెచ్చులు ఊడి నెత్తి మీద పడుతున్నాయి.

by admin
Workers wearing helmets in government employees

బంగారు తెలంగాణ (Tealangana).. ఇది కేసీఆర్ (KCR) నినాదం. ఉద్యమ సమయంలో.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో.. దీన్ని బాగా ప్రమోట్ చేశారు. మెల్లమెల్లగా రాష్ట్రం.. బంగారు తెలంగాణ అవుతోందని చెబుతున్నారు. కానీ, ఇది బంగారు తెలంగాణ కాదు, బాధల తెలంగాణ అనే విమర్శలు వినిపిస్తున్నాయి. సర్కారు బడులు, హాస్టళ్లలో భవనం పెచ్చలూడి విద్యార్థులకు గాయాలు అయిన ఘటనలు చాలానే చూశాం. అయితే.. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఇదే దుస్థితి నెలకొందని ఓ సంఘటన నిరూపిస్తోంది.

జగిత్యాల (Jagtial) జిల్లా బీర్పూర్ (Beerpur)​ మండల ఎంపీడీవో ఆఫీస్​ కి వెళ్తే అక్కడి ఉద్యోగులు కుర్చీల్లో ఉండి హెల్మెట్స్ (Helmets) తో కనిపిస్తారు. అదేంటి టూ వీలర్ వాహనాలపై వెళ్లేటప్పుడు కదా హెల్మెట్స్ పెట్టుకునేది.. వీళ్లేంటి ఆఫీసులో ఉండి పెట్టుకున్నారని చూసిన ఎవరైనా అవాక్కవ్వకుండా ఉండరు. ఉద్యోగులు చెప్పిన దాని ప్రకారం… 2016 నుంచి ఆఫీస్ పాత భవనంలో కొనసాగుతోంది. ఏడేళ్లుగా కురుస్తున్న వర్షాలకు ఇప్పుడది శిథిలావస్థకు చేరుకుంది. పెచ్చులు ఊడి నెత్తి మీద పడుతున్నాయి.

అజాగ్రత్తగా ఉంటే ఎక్కడ మాడు పగులుతుందో అని ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ హెల్మెట్లు పెట్టుకుని పని చేస్తున్నారు. గతేడాది ఎంపీడీవో కూర్చొని ఉండగా ఆయన టేబుల్‌ పై పెచ్చులు ఊడి పడ్డాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్తే.. అదనపు కలెక్టర్‌ తక్షణమే ఆఫీస్ ను మార్చాలని ఆదేశించారు. కానీ, ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఆఫీస్ లో చిన్న టేబుల్ ను కూడా జరిపింది లేదు.

ఈ ఏడాది రెండుచోట్ల పెచ్చులూడి పడ్డాయి. ఉన్నతాధికారుల తీరుతో విసుగెత్తిన ఉద్యోగులు తమ సమస్యను ఇలా వినూత్న రీతిలో హెల్మెట్లు పెట్టుకుని నిరసన తెలిపారు. మరోవైపు, వర్షానికి నీరు లోపలికి వస్తుండడంతో ఫైళ్లు తడిచిపోతున్నాయని వాపోతున్నారు ఉద్యోగులు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. కొత్త బిల్డింగ్​ నిర్మించాలని కోరుతున్నారు.

You may also like

Leave a Comment