Telugu News » Brilliant Brave girl : ఆ బాలిక జీవితాన్ని పట్టుకు వేలాడింది..!

Brilliant Brave girl : ఆ బాలిక జీవితాన్ని పట్టుకు వేలాడింది..!

by sai krishna

తల్లి, చెల్లి తన కళ్లముందే..గోదావరిలో కొట్టుకుపోతున్నారు. కిందకు చూస్తే ఉధృతంగా ప్రవహిస్తున్న గోదారి. గుండెలు పగిలేలా ఏడ్చినా ఆమె ఆర్తనాదాలు ఎవరి చెవినా పడని సమయం.చేజారితే వాళ్లలాగా గోదావరి(Godavari)లో తానూ కొట్టుకుపోతుంది. క్షణక్షణం బతుకు మీద ఆశలు చచ్చిపోతున్నతరుణమది.

బతికినా శూన్యంగా కనిపిస్తున్న భవిష్యత్తు. అప్పుడు తనలోంచి తనకు వినిపిస్తున్న జీవన మంత్రం.. బతకాలని, ఏదిఏమైనా బతకాలి. తన వాళ్లను తలుచుకుని ఏడవడానికైనా బతకాలి. జరిగిన ఘోరాన్ని నలుగురికీ చెప్పడానికైనా బతికాలి.

ఇదీ.. వంతెనకింద ఆధారంగా దొరికిన ఓ పైపుని పట్టుకుని వేల్లాడుతున్న 13 ఏళ్ల లక్ష్మీ కీర్తన పరిస్థితి. మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారే అలా..కీర్తనకు ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఆమె సమయ స్ఫూర్తి 100కు డయల్ చేయమని సలహా ఇచ్చింది. అత్యంత కష్టంతో తన దగ్గరున్న సెల్ ఫోన్ తో 100 కి డయల్ చేసింది.

కొద్ది క్షణాల వెనక్కువెళితే..ఇప్పటి కీర్తన విపత్కర పరిస్థితి కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే..గుంటూరు జిల్లా(Guntur) తాడేపల్లి(Thadepalli) లో ఉంటున్న ఉలవ సురేశ్‌తో పుష్పాల సుహాసిని (35) అనే మహిళ సహజీవనం చేస్తోంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు.

ఒకరు జెర్సీ (1)బాధితులరాలు లక్ష్మీకీర్తన(13). సురేశ్‌ ఆదివారం తెల్లవారు జామున 4 గం.ల సమయంలో సుహాసిని సహా పిల్లలిద్దరినీ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌( Dr. B.R.Ambedkar) కోనసీమ జిల్లా( kona seema District) రావులపాలెం గౌతమి పాత వంతెన(Gowthami old bridge ) వద్దకు తీసుకెళ్లాడు.

ఏమైందో తెలియదు అప్పటి దాకా మనిషిగా ఉన్న సురేష్ ఒక్కసారిగా రాక్షసుడిలా మారిపోయాడు. చిన్నపిల్లలనే కనికరం లేకుండా ముగ్గుర్నీ గోదావరిలోకి తోసేసాడు. ఆ ముగ్గురినీ వంతెనపై నుంచి గోదాట్లోకి తోసేశాడు.

తల్లి సుహాసిని  , చెల్లి  జెర్సీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోగా లక్ష్మీకీర్తన బ్రిడ్జి గోడకు అడుగున ఉన్న పైపు పట్టుకుని ఆగింది. ప్రాణభయంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెకు 100కు డయల్‌ చేయాలనే మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే తన సెల్‌ఫోన్‌ నుంచి 100కు డయల్‌ చేసి రక్షించాలని కోరింది.

వెంటనే స్పందించిన ఎస్‌ఐ వెంకటరమణ నేషనల్‌హైవే సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పాపకు ధైర్యం చెబుతూ ఆమెను కాపాడారు. అంతటి విపత్కర పరిస్ధితుల్లోనూ ధైర్యం కూడగట్టుకుని సెల్‌ఫోన్‌ సాయంతో పోలీసులకు సమాచారం ఇవ్వాలన్న ఆలోచన చేసిన లక్ష్మీకీర్తన ధైర్యాన్ని పలువురు కొనియాడారు.

You may also like

Leave a Comment