Telugu News » Yatra 2 Movie: సీఎం జగన్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘యాత్ర 2’ కొత్త‌ పోస్టర్ విడుదల..!

Yatra 2 Movie: సీఎం జగన్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘యాత్ర 2’ కొత్త‌ పోస్టర్ విడుదల..!

గురువారం (డిసెంబర్‌ 21) వైఎస్‌ జగన్‌ జన్మదిన సందర్భంగా యాత్ర 2 నుంచి ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ఒక‌వైపు జీవా కూర్చొని ఉండ‌గా మ‌రోవైపు మమ్ముట్టి ఉన్నాడు.

by Mano
Yatra 2 Movie: CM Jagan's Birthday Special.. 'Yatra 2' New Poster Released..!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి (YS. Rajashekar) జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన యాత్ర(Yatra) సినిమాకు సీక్వెల్‌గా యాత్ర-2 విడుదలకు సిద్ధమైంది. మహి వి రాఘవ్‌ (Mahi V Raghav) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో వైఎస్సార్‌ పాత్రలో మలయాళ స్టార్‌ మమ్ముట్టి నటిస్తుండగా వైఎస్‌ జగన్‌ పాత్రలో జీవా నటిస్తున్నారు.

Yatra 2 Movie: CM Jagan's Birthday Special.. 'Yatra 2' New Poster Released..!

వైఎస్సార్ మరణానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, ఆయన తనయుడు వైఎస్ జగన్‌ రాజకీయ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో యాత్ర-2కి సంబంధించిన ఒక్కో అప్‌డేట్‌ వదులుతూ ఆసక్తిని పెంచుతున్నారు.

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్‌, ఫ‌స్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా గురువారం (డిసెంబర్‌ 21) వైఎస్‌ జగన్‌ జన్మదిన సందర్భంగా యాత్ర 2 నుంచి ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ఒక‌వైపు జీవా కూర్చొని ఉండ‌గా మ‌రోవైపు మమ్ముట్టి ఉన్నాడు.

ఈ పోస్ట‌ర్‌లో ”నేనెవ‌రో ఈ ప్ర‌పంచానికి ఇంకా తెలియ‌కపోవ‌చ్చు. కానీ ఒక్క‌టి గుర్తుపెట్టుకోండి. నేను వైఎస్. రాజశేఖర్‌రెడ్డి కొడుకుని” అంటూ పోస్ట‌ర్‌పై రాసుకొచ్చారు. త్రీ ఆటమ్‌ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్న ‘యాత్ర 2’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 08న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు చిత్ర‌యూనిట్ తెలిపింది.

యాత్ర సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాను గత ఎన్నికల సమయంలో విడుదల చేశారు. అనంతరం జగన్ సీఎం అయ్యారు. ఇప్పుడు కూడా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మరో రెండు, మూడు నెలల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో యాత్ర-2 సినిమా విడుదలవుతుండడంతో.. ఇది ఎన్నికల వ్యూహంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

You may also like

Leave a Comment