నెల్లూరు (Nellore) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అధికార వైసీపీ (YCP) పార్టీకి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి (MLC Parvathar Reddy) వాహనం ప్రమాదానికి గురైంది. లారీని ఎమ్మెల్సీ కారు గురువారం అర్ధరాత్రి దగదర్తి దగ్గర ఢీకొట్టింది. కాగా ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ పీఏ వెంకటేశ్వర్లు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. పర్వతరెడ్డికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం.

వెంటనే స్పందించిన ఆయన పోలీసులకి సమాచారం ఇచ్చి.. ఎమ్మెల్సీ పర్వతరెడ్డిని, డ్రైవర్ను ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది.. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.