అప్పుడప్పుడు మనకి ఇదివరకు సినిమా ఇండస్ట్రీలో జరిగిన విషయాల గురించి అనేక వార్తలు వస్తూ ఉంటాయి. తాజాగా అలనాటి నటుల రెమ్యూనరేషన్ వివరాలు వైరల్ అవుతున్నాయి. మరి అప్పట్లో హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకునేవారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సీనియర్ ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో నటించి, అందరినీ ఆకట్టుకున్నారు.
1980లో రెమ్యూనరేషన్ గురించి చూస్తే.. ఎన్టీఆర్ తో సినిమా చేయాలంటే దాదాపూ 40 లక్షల బడ్జెట్ అయ్యేదిట ప్రతి సినిమాకి 12 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే వారు ఆయన. అప్పట్లో సౌత్ లోనే హైయెస్ట్ రెమ్యూనిరేషన్ తీసుకునేవారు. ఇక కృష్ణ గారి విషయానికి వస్తే 20 నుండి 25 లక్షల రూపాయల బడ్జెట్ తో కృష్ణ సినిమా ఉండేది 7 లక్షల దాకా రెమ్యూనరేషన్ తీసుకునేవారు. అప్పటి టాప్ హీరోలలో నాగేశ్వరరావు కూడా ఒకరు. ఈయన సినిమాకి 30 లక్షల దాకా బడ్జెట్ అయ్యేది. దాదాపు పది లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారు.
Also read:
శోభన్ బాబు సినిమాకి 20 లక్షల దాకా బడ్జెట్ అయ్యేది. ఈయన ప్రతి సినిమాకి 6 నుండి 7 లక్షల రూపాయలు తీసుకునేవారు. ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే చిరంజీవి సినిమాకి 17 లక్షల దాకా బడ్జెట్ అయ్యేది. ఒక్కో సినిమాకి మూడు నుండి నాలుగు లక్షల రెమ్యునరేషన్ తీసుకునే వారు చిరు.
సుమన్ సినిమాకి 17 లక్షల బడ్జెట్ అయ్యేది సుమన్ మూడు లక్షల వరకు తీసుకునేవారు. ఇలా అప్పట్లో లక్షల బడ్జెట్ తో మూవీ తీసేవారు. లక్షల రెమ్యూనరేషన్తో సినిమాలు అయిపోయేవి. కానీ ఇప్పుడు కోట్ల రూపాయలతో సినిమాలు తీస్తున్నారు పైగా హీరోలు కూడా కోట్ల రూపాయల లోనే తీసుకుంటున్నారు.