మనం నిద్రపోయినప్పుడు, మనకి ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు మనకి ఏ కల వచ్చిందనేది కూడా మనకి గుర్తు ఉండదు. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం మనకి నిద్ర వచ్చిన కల వెనుక ఒక అర్థం ఉంటుంది అయితే ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని కలలకు సంబంధించి చూద్దాం. మనకు వచ్చే ప్రతి కలకి కూడా ఒక అర్థం ఉంటుందని స్వప్న శాస్త్రం చెప్పడం జరిగింది. కలలో కనుక ఇలా జరిగితే అశుభమే, కలలో జుట్టు కత్తిరించడం వెనుక శుభం, అశుభం రెండు ఉండొచ్చు.
పురుషులకి స్త్రీలకి ఇది భిన్నంగా ఉంటుంది స్వప్న శాస్త్రం ప్రకారం పురుషులు కలలో జుట్టు కత్తిరించుకోవడం శుభసూచకం. అదే స్త్రీ కి తన జుట్టు కత్తిరించుకున్నట్లు కల వచ్చిందంటే అది అశుభసంకేతంగా పరిగణించబడుతుందని స్వప్న శాస్త్రం చెప్తోంది. కలలో పొడవాటి జుట్టును చూసినట్లయితే భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయి. కలలో జుట్టు కత్తిరించే స్త్రీని చూడడం అశుభం.
Also read:
ఇటువంటి కల కనుక వచ్చిందంటే ఆర్థిక నష్టం కలుగుతుంది. స్త్రీ యొక్క ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అలానే భయానికి సంకేతం. కుటుంబంలో కలహాలు కూడా రావచ్చు. మహిళలు జుట్టు కత్తిరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గురువారంనాడు జుట్టుని అసలు కత్తిరించకూడదు. కొన్ని కొన్ని సార్లు భయంకరమైన కలలు కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఇలా రావడం కూడా అసలు మంచిది కాదు.