మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థాయికి ఎదిగిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆయనను పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ స్థాయికి చేరుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి చాలానే కష్టపడ్డారు. చిరంజీవి అసలు పేరు శివ శంకర్ వర ప్రసాద్ అన్న సంగతి తెలిసిందే. ఆయన తాతగారు శివభక్తుడు కావడంతో చిరంజీవికి ఈ నామకరణం చేసారు. అయితే.. చిరు మూవీస్ లోకి రాకముందు ఓ కల వచ్చిందట. చిరంజీవి.. అంటూ వచ్చిన ఆ కలకి గుర్తు గానే ఆయన సినిమాల్లోకి వచ్చే ముందు చిరంజీవి అని పేరు పెట్టుకున్నారు.
మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి స్కూల్, కాలేజీ డేస్ లో ఉన్నప్పుడే నటనపై ఇంటరెస్ట్ తో మూవీ రంగంలోకి రావాలని అనుకున్నారట. అందుకోసమే మద్రాస్ ఫిలిం ఇన్సిటిట్యూట్ లోనే ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ సమాయంలోనే నటుడు సుధాకర్, చిరంజీవి లు కలిసి పూర్ణ పిక్చర్స్ సంస్థ వారి సినిమాలు చూసి రివ్యూ లు ఇచ్చేవారట. అలా ఓ సారి సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు, ఆ సినిమాలో హీరో గా నటించిన వ్యక్తి మేకప్ ఆర్టిస్ట్, డ్రైవర్ వచ్చి వారిని లేపేసి ఆ ప్లేస్ లో కూర్చున్నారట.
ఇక చేసేది లేక వారు నిలబడే సినిమాను చూశారట. అయితే.. ఈ సినిమా పూర్తయ్యాక పూర్ణ పిక్చర్స్ సంస్థ అధినేత భార్య మూవీ ఎలా ఉంది అంటూ ప్రశ్నించగా.. “ఆంటీ మేము మీ అతిధులుగా సినిమాకు వెళ్ళాం. కానీ, అక్కడ మాకు ఇలా అవమానం జరిగింది. గొడవ పడితే మీకు మాటొస్తుందనే భరించాం.. నేనే ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో గా పేరు తెచ్చుకోకపోతే అడగండి” అంటూ చిరంజీవి ఛాలెంజ్ చేశారట. నిజంగానే చిరంజీవి ఆ ఛాలెంజ్ ను సీరియస్ గా తీసుకుని కెరీర్ లో తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. నేడు ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో, ఇండస్ట్రీ పెద్దగా నిలబడ్డారాయన. కేంద్రం ఆయన సేవలకు గుర్తింపుగా పద్మ విభూషణ్ అవార్డుని కూడా ప్రకటించింది.