Telugu News » Karishma Kapoor: నా భర్త నన్ను వేలం వేశాడు.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్య..!

Karishma Kapoor: నా భర్త నన్ను వేలం వేశాడు.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్య..!

ఇండస్ట్రీలో కపూర్ ఫ్యామిలీకి ప్రత్యేక స్థానముంది. ప్రేమఖైదీ అనే సినిమాతో హీరోయిన్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టింది కరీష్మా. ఆపై అనేక సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా తార స్థాయికి ఎదిగింది.

by Mano
Karishma Kapoor: My husband auctioned me.. Star heroine's sensational comment..!

సినీ ఇండస్ట్రీ రంగుల ప్రపంచం లాంటింది. సహజీవనం, పెళ్లి, విడాకులు సర్వ సాధారణం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీష్మా కపూర్(Karishma Kapoor) ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో కపూర్ ఫ్యామిలీకి ప్రత్యేక స్థానముంది. ప్రేమఖైదీ అనే సినిమాతో హీరోయిన్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టింది కరీష్మా. ఆపై అనేక సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా తార స్థాయికి ఎదిగింది.

Karishma Kapoor: My husband auctioned me.. Star heroine's sensational comment..!

తాజాగా కరీష్మా కపూర్ ఓ ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం గురించి సంచలన విషయాలను వెల్లడించింది. తన మాజీ భర్త ఏకంగా తనను అమ్మకానికి పెట్టాడంటూ వాపోయింది. అందులోనూ హనీమూన్ లో అతడితో పాటు స్నేహితులతో కూడా కలిసి తాను సన్నిహితంగా గడపాలని ఆయన తనని బలవంతం చేసినట్లు గుర్తుచేసుకుని ఎమోషనల్ అయింది.

ఇండస్ట్రీలో పదేళ్ల పాటు తన జోరు చూపిస్తూ దూసుకెళ్లింది కరీష్మా. ఇందులో భాగంగానే ఆమె పలు అవార్డులను కూడా కైవసం చేసుకుంది. అయితే కరీష్మా సినిమాల్లో బాగానే రాణించినా తన వ్యక్తిగత జీవితం అంత సాఫీగా సాగలేదనే చెప్పాలి. కెరీర్ మంచి ఫామ్లో ఉన్న సమయం లోనే ఆవిడ హీరో అజయ్ దేవగణ్ పీకల్లోతు ప్రేమాయణం నడిపించింది. అయితే వారి ప్రేమ ఎంతోకాలం నిలవలేదు.

ఆ తర్వాత అభిషేక్ బచ్చన్‌తో ఎంగేజ్‌మెంట్ అయినప్పటికీ పెళ్లి పీటల వరకు వెళ్లలేదు. ఆ తర్వాత 2003లో ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు బిడ్డలు కూడా. అయితే కొంతకాలానికి సంజయ్ తో మనస్పర్థలు రావడంతో 2016 లోనే విడాకులు ఇచ్చేసింది. అయితే ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

 

You may also like

Leave a Comment