Telugu News » కో స్టార్స్ నే ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోలు.. లిస్ట్ ఓ లుక్ వెయ్యండి!

కో స్టార్స్ నే ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోలు.. లిస్ట్ ఓ లుక్ వెయ్యండి!

తమ కో నటులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోలు!

by Sri Lakshmi

ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు చేసుకునే వారు చాలా మందే ఉంటారు. తమతో స్క్రీన్ షేర్ చేసుకునే వారితో సహజంగానే స్నేహం ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని సార్లు ఈ స్నేహం పరిమితులు దాటి ప్రేమగా మారి.. వారు పెళ్లి కూడా చేసుకునే వరకు వెళ్తుంటుంది. అయితే.. తమతో తెర పంచుకున్న వారినే ప్రేమించి పెళ్లి చేసుకుని.. మారీడ్ లైఫ్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్న వారి లిస్ట్ ను ఇప్పుడు చూసేద్దాం.

నాగార్జున-అమల:


పెళ్ళికి ముందు నాగార్జున అమల కలిసి సినిమాల్లో నటించే వారన్న సంగతి తెలిసిందే. ఇద్దరు కలిసి స్క్రీన్ ను పంచుకున్నప్పుడే మనసుని కూడా పంచుకున్నారు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తరువాత అమల పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు.

మహేష్ బాబు – నమ్రత:


సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన భార్య నమ్రతని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళికి ముందు వీరిద్దరూ వంశం సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ పెళ్లి వైపు అడుగులు వేస్తే.. వీరి బంధం ఇద్దరు పిల్లలతో ఇప్పటికీ పదిలంగా ఉంది.

స్నేహ-ప్రసన్న:


ఎటువంటి షో లేకుండా చాలా సింపుల్ గా నటించే స్నేహ అంటే తెలుగు వారికి చాలా ఇష్టం. అయితే నటి స్నేహ తమిళ్ లో కూడా సినిమాల్లో నటించారు. అలా తమిళ్ సినిమాల్లో తనతో తెర పంచుకున్న ప్రసన్నను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

సూర్య -జ్యోతిక:


ఆఫ్ స్క్రీన్ లో కూడా బెస్ట్ జోడి ఎవరు అంటే ముందు వినిపించే పేరు ఈ జంటదే. సూర్య, జ్యోతిక ఇద్దరు చాలా తమిళ్ సినిమాల్లో నటించారు. వీరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తరువాత కూడా తమ కెరీర్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్నారు.

అజిత్ షాలిని:


తమిళ్ నటుడు అజిత్ షాలినితో ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకున్న తరువాత షాలిని సినిమాలకు దూరం అయ్యారు.

యశ్ – రాధికా పండిట్:


కెజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న యశ్ రాధికా పండిట్ ను ప్రేమించారు. వీరిద్దరూ కూడా స్క్రీన్ పంచుకున్నప్పుడే ప్రేమలో పడ్డారు. యశ్ ను పెళ్లి చేసుకున్న తరువాత రాధికా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

You may also like

Leave a Comment